ప్రభాస్‌లానే చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్!

ప్రభాస్‌లానే చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్!

Updated On : February 13, 2021 / 8:37 PM IST

Pan India Star: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా రెబల్ స్టార్ ప్రభాస్‌లాగే పాన్ ఇండియా స్టార్‌గా అవతరించబోతున్నారా?.. అంటే, అవుననే మాట వినిపిస్తోంది. మన టాలీవుడ్ నుండి మరో స్టార్ హీరో పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోబోతున్నాడంటూ ఫిలిం వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

‘మగధీర’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు చరణ్. ఇది తనకీ, తారక్‌కీ ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇద్దరు హీరోలు కాబట్టి ఏ ఒక్కరికో క్రెడిట్ ఇవ్వడం కుదరదు. ఆ లెక్కన ‘బాహుబలి’ క్రేజ్‌ని బట్టి క్రెడిట్ జక్కన్న ఖాతాలోకే వెళ్తుంది. తర్వాత నటీనటులు, సాంకేతిక నిపుణుల సంగతి..

RRR

తర్వాత చెర్రీ, ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్, మన ఇండియన్ సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన శంకర్‌తో చెయ్యబోతున్నాడు. శంకర్, చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది. ‘ఆర్ఆర్ఆర్’ లో ఇద్దరు హీరోలు కాబట్టి.. ఈ సినిమా చరణ్‌కి సోలో పాన్ ఇండియా సినిమా అవుతోంది. సో ఈ లెక్కన మెగా పవర్‌స్టార్ పాన్ ఇండియా స్టారేగా మరి.

Ram Charan