Ram Charan : నాకు బెంగాలీ సినిమాల్లో నటించాలని ఉంది.. ఎవరైనా ఆఫర్ ఇస్తే బాగుండు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
సినిమాల గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నాకు బెంగాలీ సినిమాల్లో నటించాలని ఉంది. బెంగాలీ సినిమాలు బాగుంటాయి. ఎవరైనా వచ్చి.............

Ram Charan wants to do films in Bengali
Ram Charan : RRR సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. నార్త్ లో కూడా చరణ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మొన్నటివరకు RRR సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసి ఇటీవలే ఇండియాకి వచ్చాడు.
తాజాగా రామ్ చరణ్ ఢిల్లీలో నిర్వహించిన హిందుస్థాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నాడు. ఈ సమ్మిట్ కి సౌత్ నుంచి కేవలం రామ్ చరణ్ ని మాత్రమే ఆహ్వానించడం విశేషం. అలాగే బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ని ఆహ్వానించారు. రామ్ చరణ్, అక్షయ్ కుమార్ లు ఒకే వేదికపై సందడి చేశారు. వీరిద్దర్నీ వేదికపై పలు ప్రశ్నలు అడగగా సమాధానాలు ఇచ్చారు. అక్షయ్, రామ చరణ్ కూడా పలు అంశాల గురించి ఆసక్తిగా మాట్లాడారు. ఇక వీరిద్దరూ కలిసి తెలుగు, హిందీ పాటలకి డ్యాన్సులు వేసి అదరగొట్టారు.
సినిమాల గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ”నాకు బెంగాలీ సినిమాల్లో నటించాలని ఉంది. బెంగాలీ సినిమాలు బాగుంటాయి. ఎవరైనా వచ్చి ఆఫర్ ఇస్తే బాగుండు” అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
అయితే సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు ట్రోల్ అవుతున్నాయి. బెంగాలీ సినిమాలు అంటే ఒకప్పుడు సత్యజిత్ రే కాలంలో బాగుండేవి. కానీ ఇటీవల కాలంలో మన సౌత్ సినిమాలని తీసుకొని వాటిని రీమేక్ చేసి నాశనం చేశారు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలా రీమేక్ చేసిన సినిమాల్లో రామ్ చరణ్ మగధీర కూడా ఉంది. దీంతో నెటిజన్లు ఈ సినిమా చూశాక కూడా నీకు బెంగాలీ సినిమాలు చేయాలనిపిస్తుందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి రామ్ చరణ్ చెప్పిన ఈ మాటల్ని విని బెంగాలీ దర్శకులు ఎవరైనా రామ్ చరణ్ ని అప్రోచ్ అవుతారేమో చూడాలి.