Ranbir Kapoor – Alia Bhatt: లవ్ బర్డ్స్ కరోనా నుండి కోలుకున్నారు.. రచ్చ చెయ్యడానికి మాల్దీవ్స్ వెళ్లారు…

కరోనాతో ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ దూరం దూరంగానే ఉండాల్సొచ్చింది. 15 రోజులు కలుసుకోకుండా దూరంగా ఉన్న ప్రేమికులు ఇప్పుడు ఎవ్వరూ విడదీయలేని చోటికి జంప్ అయ్యారు. షూటింగ్ లేదు, కరోనా భయం లేదు.. కొన్ని రోజులైనా ప్రశాంతంగా చిల్ అవుదామని ఎక్కడికి చెక్కేశారో తెలుసా?..

Ranbir Kapoor – Alia Bhatt: లవ్ బర్డ్స్ కరోనా నుండి కోలుకున్నారు.. రచ్చ చెయ్యడానికి మాల్దీవ్స్ వెళ్లారు…

Ranbir Kapoor – Alia Bhatt

Updated On : April 20, 2021 / 1:27 PM IST

Ranbir Kapoor – Alia Bhatt: కరోనాతో ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ దూరం దూరంగానే ఉండాల్సొచ్చింది. 15 రోజులు కలుసుకోకుండా దూరంగా ఉన్న ప్రేమికులు ఇప్పుడు ఎవ్వరూ విడదీయలేని చోటికి జంప్ అయ్యారు. షూటింగ్ లేదు, కరోనా భయం లేదు.. కొన్ని రోజులైనా ప్రశాంతంగా చిల్ అవుదామని ఎక్కడికి చెక్కేశారో తెలుసా?..

Ranbir Kapoor – Alia Bhatt

రణబీర్‌కి కోవిడ్ పాజిటివ్ రావడంతో తర్వాత ఆలియా కూడా కరోనా టెస్ట్ చేయించుకుంది. అసలే ప్రేమికులు.. ఆపై కలిసి సినిమా చేస్తున్నారు.. రాకుండా ఉంటుందా..? ఆలియాకు కూడా కరోనా పాజటివ్ వచ్చింది. దాంతో ఒకర్నొకరు కలవకుండా 15 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లోనే టైమ్ పాస్ చేశారు. ఇప్పుడు కరోనా నుంచి కోలుకుని సరదాగా సముద్రం దగ్గరికెళ్లిపోయారు.

Ranbir Kapoor – Alia Bhatt

ఇన్ని రోజులు కలుసుకోకుండా ఉన్న ఆలియా -రణబీర్ ఇప్పుడు కలిసి ఉండడానికి చిన్న ట్రిప్ వేసుకున్నారు. ఎవరూ డిస్టర్బ్ చెయ్యకుండా, ఎవరికీ టచ్‌లో ఉండకుండా ఎంచక్కా మాల్దీవ్స్ చెక్కేశారు ఈ లవ్ బర్డ్స్. అక్కడ ఫుల్‌గా రిలాక్స్ అయ్యి మళ్లీ షూట్స్‌లో కంటిన్యూ అవ్వబోతున్నారు ఈ జంట. ఇద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్‌‌కి వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ranbir Kapoor – Alia Bhatt