Nagarjuna-Rashmi: నాగ్ సినిమాలో రష్మీ.. బంపర్ ఆఫర్ పట్టేసినట్లేనా?

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఇప్పుడు ఆచితూచి కథలను ఎంచుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే వయసుకి తగిన పాత్రలతో పాటు ఇప్పుడు ఎంచుకొనే కథలే సీనియర్ హీరోలకు మరి ఇరవై ఏళ్ల కెరీర్ తెచ్చిపెడుతుంది.

Nagarjuna-Rashmi: నాగ్ సినిమాలో రష్మీ.. బంపర్ ఆఫర్ పట్టేసినట్లేనా?

Rashmi In Nagarjuna Movie Is It Like Taking A Bumper Offer

Updated On : May 27, 2021 / 5:15 PM IST

Nagarjuna-Rashmi : టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఇప్పుడు ఆచితూచి కథలను ఎంచుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే వయసుకి తగిన పాత్రలతో పాటు ఇప్పుడు ఎంచుకొనే కథలే సీనియర్ హీరోలకు మరి ఇరవై ఏళ్ల కెరీర్ తెచ్చిపెడుతుంది. అందుకే నాగ్ ఇప్పటికీ మన్మధుడు ట్యాగ్ లైన్ తో కొనసాగుతూనే కథల ఎంపికలో కొత్తదనాన్ని చూస్తున్నాడు. నాగ్ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ హిందీ సినిమాతో పాటు మనం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలకు సీక్వెల్ చేయనున్నాడు.

ఇక.. దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న స్పై థ్రిల్లర్ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుంది. ఆ మధ్య గోవాలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తవగా.. రెండవ షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. కాస్త ఈ కరోనా విరామం ఇస్తే రెండో షెడ్యూల్‌ను జూన్ మూడో వారం నుంచి ప్రారంభించబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో నాగ్ ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనుండగా నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

కాగా.. ఈ సినిమాలో ఓ కీలకమైన పవర్ ఫుల్ పాత్రలో యాంకర్ రష్మీ కూడా నటించనుందని తెలుస్తుంది. రష్మీ ఇప్పటికే ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్ గా నటించగా రష్మీలో నటన తెలిసిన ప్రవీణ్ ఈ సినిమాలో పాత్ర కోసం ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రష్మీ తోటి యాంకర్ అనసూయ ఒకవైపు యాంకర్ గానే కాకుండా సినిమాలో కూడా మంచి పాత్ర దక్కితే నటించి మెప్పిస్తుంది. రష్మీ కూడా అదే బాటలో ప్రాధాన్యత ఉన్న పాత్రలతో నటించేందుకు సిద్దమవగా నాగ్-ప్రవీణ్ సినిమా ఫ్లాట్ ఫామ్ అయినట్లుగా కనిపిస్తుంది.