Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక.. అదిరింది అంటోన్న ఫ్యాన్స్!
కన్నడ బ్యూటీ రష్మిక మందన టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్థానాన్ని అతితక్కువ సమయంలోనే దక్కించుకుంది. ఆమె చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్.....

Rashmika Mandanna In Bollywood Movie Animal
Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్థానాన్ని అతితక్కువ సమయంలోనే దక్కించుకుంది. ఆమె చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలుస్తుండటంతో, చాలా త్వరగా ఆమె స్టార్ హీరోల చూపుల్లో పడింది. ఫలితంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ చిన్నది. ఇక ఇప్పటికే నేషనల్ క్రష్‌గా తనకంటూ అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది.
Rashmika Mandanna : ఆలోచనలు మారాలి అంటూ.. ఫిట్నెస్ విషయంలో రష్మిక సలహాలు..
ప్రస్తుతం రష్మిక మందన చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. కాగా తాజాగా రష్మిక బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ‘యానిమల్’ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో తొలుత రష్మిక మందనను ఓ స్పెషల్ సాంగ్ కోసం తీసుకుంటారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది. కానీ ఇప్పుడు ఏకంగా ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం రావడంతో రష్మిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Rashmika Mandanna: శ్రీవల్లి కోసం అఖండ డైరెక్టర్ ఆరాటం!
ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇక తెలుగులో పుష్ప 2 చిత్రంలో మరోసారి తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది రష్మిక. కాగా యానిమల్ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాలో రష్మిక పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే యానిమల్ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.