Raviteja-Boyapati Combination: బోయపాటితో మాస్ రాజా.. భద్ర రిపీట్ చేస్తారా?

భద్ర సినిమాను అటు రవితేజ అభిమానులు కానీ.. ఇటు దర్శకుడు బోయపాటి శ్రీను అభిమానులు కానీ ఎవరూ మర్చిపోలేరు. కాస్త రొమాంటిక్ టచ్ ఇస్తూనే.. కామెడీ యాంగిల్ లో కథ నడుస్తున్నట్లుగా కనిపిస్తూనే ప్రేమ కథ ఒకటి బ్యాకెండ్ లో నడుస్తున్నటుగానే..

Raviteja-Boyapati Combination: బోయపాటితో మాస్ రాజా.. భద్ర రిపీట్ చేస్తారా?

Ravi Teja With Boyapati Will Bhadra Repeat

Updated On : May 23, 2021 / 12:19 PM IST

Raviteja-Boyapati Combination: భద్ర సినిమాను అటు రవితేజ అభిమానులు కానీ.. ఇటు దర్శకుడు బోయపాటి శ్రీను అభిమానులు కానీ ఎవరూ మర్చిపోలేరు. కాస్త రొమాంటిక్ టచ్ ఇస్తూనే.. కామెడీ యాంగిల్ లో కథ నడుస్తున్నట్లుగా కనిపిస్తూనే ప్రేమ కథ ఒకటి బ్యాకెండ్ లో నడుస్తున్నటుగానే సినిమా అమాంతం ఒక్కసారి సీరియస్ టర్న్ తీసుకొని గూస్ బంప్స్ వచ్చేలా కథ ఉవ్వెత్తున లేచి హీరో అంటే ఇలా ఉండాలి అనేలా ఫీల్ తెస్తుంది భద్ర సినిమా. బోయపాటికి తొలి సినిమా అయినా మేకింగ్ లో తన పవర్ చూపించాడు.

సహజంగా భద్ర లాంటి సినిమా తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని చాలామంది కోరుకుంటారు. కానీ.. భద్ర సినిమా వచ్చి 16 ఏళ్ళైనా రవితేజ-బోయపాటి నుండి ఇన్నాళ్లుగా ఆ ఊసే లేదు. కానీ, ఇప్పుడు మొత్తానికి ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం బోయపాటి అఖండ సినిమా చేస్తున్నాడు. చివరి దశకు వచ్చిన ఈ సినిమా బాలయ్యతో కాంబినేషన్ కు హ్యాట్రిక్ సక్సెస్ కానుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

కాగా, అఖండ సినిమా తర్వాత బోయపాటి రవితేజతో సినిమా చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అంటున్నారు. ఇప్పటికే ఓ బడా నిర్మాత ఈ ప్రాజెక్టు టేకప్ చేయగా ఇప్పటికే రవితేజ డేట్స్ బ్లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. జూన్ నెల చివరి నాటికి అఖండను పూర్తి చేయాలని చూస్తున్న బోయపాటి ఆ తర్వాత రవితేజ సినిమాపై పనిచేయనున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా మరోసారి భద్ర సక్సెస్ రిపీట్ చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.