Revathy Sampath : దక్షిణాది సినీ ప్రముఖులపై నటి రేవతి సంపత్ షాకింగ్ కామెంట్స్..

దక్షిణాది సినీ ప్రముఖులపై మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేశారు.. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి..

Revathy Sampath : దక్షిణాది సినీ ప్రముఖులపై నటి రేవతి సంపత్ షాకింగ్ కామెంట్స్..

Revathy Sampath

Updated On : June 18, 2021 / 12:01 PM IST

Revathy Sampath: దక్షిణాది సినీ ప్రముఖులపై మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేశారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. దాదాపు 14 మంది ఆమెను నోటికి చెప్పలేని విధంగా దూషించారనే విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సినీ ప్రముఖులతో పాటు ఓ డాక్టర్‌, సబ్‌ఇన్స్‌పెక్టర్, ఒక డీవైఎఫ్ఏ నేత పేర్లతో పాటు మొత్తం 14 మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు రేవతి సంపత్. దీంతో ఒక్కసారిగా మలయాళ చిత్ర పరిశ్రమ కుదుపుకు లోనైంది.. తనను లైంగికంగా, మానసికంగా, మాటలతో వేధించిన 14 మంది వ్యక్తుల పేర్లు బయట పెట్టిందామె. ఈ జాబితాలో దాదాపు 300 లకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ మలయాళ నటుడు, తెలుగులో అవార్డ్ విన్నింగ్ సినిమా చేసిన ఓ దర్శకుడు, పోలీస్ ఇన్‌స్పెక్టర్ మరియు డాక్టర్ వంటి ప్రముఖ వ్యక్తుల పేర్లు ఉన్నాయి.

దీనికి సంబంధించి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పలు పోస్టులు చేశారు రేవతి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లోనూ తనను వేధింపులకు గురిచేసిన వారి పేర్లతో పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో సంచలనం రేపిన రేవతి సంపత్ విషయంలో మలయాళ సినీ పరిశ్రమ, కేరళ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.