RRR : తెలుగు ప్రజలకు భీమ్, రామరాజు ఉగాది శుభాకాంక్షలు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచానికి చూపించబోతున్నారు దర్శకధీరుడు రాజమౌళి.

Rrr Team Wishing Everyone A Happy And Prosperous Year
RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచానికి చూపించబోతున్నారు దర్శకధీరుడు రాజమౌళి.
ఇప్పటివరకు రిలీజ్ చేసిన చరణ్, తారక్ టీజర్లకు, క్యారెక్టర్స్ తాలుకు పోస్టర్లు, అజయ్ దేవగణ్ బర్త్‌డే నాడు వదిలిన వీడియోకు రెస్పాన్స్ అదిరిపోయింది. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిసి ఉన్న న్యూ పోస్టర్ విడుదల చేశారు.
తారక్, చరణ్ పండుగ వాతావరణంలో మునిగి తేలుతూ.. భారీ జన సందోహం మధ్య సంబరాలు చేసుకుంటున్న పోస్టర్ మెగా-నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ కావల్సిన ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ పోన్ అయ్యే అవకాశముందని సమాచారం.
Read:RRR Movie : ఆర్ఆర్ఆర్ లో అండర్ వాటర్ యాక్షన్ సీన్స్, తగ్గేది లేదంటున్న చెర్రీ, జూ.ఎన్టీఆర్