KS Eshwarappa: నో డౌట్.. ఆర్ఎస్ఎస్ జెండా జాతీయ జెండా అవుతుంది: కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప‌

క‌ర్ణాట‌క మాజీ మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కాషాయం, ఆర్ఎస్ఎస్ అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

KS Eshwarappa: నో డౌట్.. ఆర్ఎస్ఎస్ జెండా జాతీయ జెండా అవుతుంది: కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప‌

Ks Eswarappa

Updated On : May 30, 2022 / 5:30 PM IST

KS Eshwarappa: క‌ర్ణాట‌క మాజీ మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కాషాయం, ఆర్ఎస్ఎస్ అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.’ ‘కాషాయాన్ని గౌరవించడం అనేది నిన్నో, నేడో ప్రారంభమైన విషయం కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా కాషాయాన్ని ప్రజలు గౌరవిస్తున్నారు. కాషాయ జెండా త్యాగానికి చిహ్నం. ఏదో ఒక రోజు ఆర్ఎస్ఎస్ జెండాయే జాతీయ జెండా అవుతుంది. ఇందులో ఏ సందేహ‌మూ లేదు. రాజ్యాంగం ప్రకారం త్రివర్ణ పతాకం మన జాతీయ జెండా. ఆ జెండాను ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇస్తాం” అని ఆయన వ్యాఖ్యానించారు.

Bihar CM: అందుకే కేంద్ర‌మంత్రి ఆర్సీపీ సింగ్‌కు రాజ్య‌స‌భ టికెట్ ఇవ్వ‌లేదు: నితీశ్

అలాగే, ముస్లింలు భార‌త్ మాతాకీ జై, వందేమాత‌రం నినాదాలు చేస్తే తాను సంతోషిస్తాన‌ని ఆయ‌న అన్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 9న కూడా కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప ఇటువంటి వ్యాఖ్య‌లే చేశారు. ”దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కాషాయ జెండాను ఆవిష్క‌రిస్తాం. ఏదో ఒక రోజు భార‌త్ హిందూ దేశంగా మారుతుంది” అని ఆయ‌న అప్ప‌ట్లో చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. క‌ర్ణాట‌క‌లో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలోనే బీజేపీ నేత‌లు ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.