Samsung The Wall : ఈ టీవీ ధర కోటికి పైనే!

ఎలక్ట్రిక్ వస్తువుల తయారీ కంపెనీ శామ్‌సంగ్‌ నుంచి మైక్రో ఎల్ఈడీ టీవీని "ది వాల్" పేరుతో రెండవ వెర్షన్ టీవీని విడుదల చేసింది. గతేడాది విడుదల చేసిన జెన్ తో పోల్చితే ఇది అప్డేటెడ్ వర్షన్.. 110 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది.

Samsung The Wall : ఈ టీవీ ధర కోటికి పైనే!

Samsung The Wall

Updated On : July 25, 2021 / 3:54 PM IST

Samsung The Wall : ఎలక్ట్రిక్ వస్తువుల తయారీ కంపెనీ శామ్‌సంగ్‌ నుంచి మైక్రో ఎల్ఈడీ టీవీని “ది వాల్” పేరుతో రెండవ వెర్షన్ టీవీని విడుదల చేసింది. గతేడాది విడుదల చేసిన జెన్ తో పోల్చితే ఇది అప్డేటెడ్ వర్షన్.. 110 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది.

ఇక దీని ధర భారీగానే ఉండనుంది. గతేడాది విడుదల చేసిన జెన్ వెర్షన్ ఎల్ఈడీ టీవీని 156000 డాలర్లుగా నిర్దారించింది కంపెనీ.. ఇది భారత కరెన్సీలు రూ.1,16,10,612 గా ఉంది. ఇక ది వాల్ ధర కూడా కోటికి పైనే ఉండనుంది.

A Closer Look at Samsung's The Wall MicroLED TV System | PCMag

ది వాల్ మైక్రో ఎల్ఈడీ టీవీ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 16కె రిజల్యూషన్ కలిగి ఉంది. ఈ కొత్త వెర్షన్‌లో అందించిన ఎల్‌ఈడీ ప్యాన్సల్స్ హై కాంట్రాస్ట్, మెరుగైన కలర్ యూనిఫార్మిటీని ఇస్తాయని శామ్‌సంగ్‌ తెలిపింది. ఇందులో కొత్త తరం ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇక దీనిని విమానాశ్రయాలు, బస్సు స్టాండుల్లోని గోడలకు పెట్టేందుకు అనువుగా ఉంటుందని శామ్‌సంగ్‌ ప్రతినిధులు తెలిపారు.