Telangana : స్కూళ్లు రీ ఓపెన్, హైకోర్టులో పిటిషన్..ఏం తేల్చనున్నారు ?
కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో.. స్కూళ్లు తెరుస్తామంటూ ప్రకటించింది తెలంగాణ సర్కార్. 2021, సెప్టెంబర్ 01వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరిచేందుకు సన్నద్ధమవుతోంది.

Telangana high court
Schools In Telangana : కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో.. స్కూళ్లు తెరుస్తామంటూ ప్రకటించింది తెలంగాణ సర్కార్. 2021, సెప్టెంబర్ 01వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరిచేందుకు సన్నద్ధమవుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత స్కూళ్లు తెరుచుకొనున్నాయి. స్కూళ్లు ప్రారంభమవనుండటంతో విద్యాసంస్థలు అన్ని ఏర్పాటు చేశాయి. విద్యార్థులకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోపక్క ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాక ఏదైనా బడిలో ఐదు కంటే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే.. ఆ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.
Read More : Telangana: కోవిడ్ భయంలోనే తెలంగాణలో స్టార్ట్ అవుతోన్న స్కూళ్లు
తెలంగాణలో స్కూళ్లు తెరుచుకోవడానికి ఒక్కరోజే టైమ్ ఉండటం.. బడులు తెరడవంపై కోర్టు ఎలాంటీ తీర్పును ఇస్తుంది.. ఏం చెబుతుందనే విషయం అటు ప్రభుత్వంతో పాటు.. ఇటు పేరెంట్స్‌లో టెన్షన్ పెడుతోంది. మరోవైపు ఆన్‌లైన్ వైపే ఎక్కువ శాతం మంది విద్యార్థుల పేరెంట్స్ మొగ్గు చూపడంతో.. ఆ దిశగా కోర్టు తీర్పునిస్తుందా.. లేక ప్రభుత్వం చెప్పినట్లే స్కూళ్లు తెరిచేందుకు అనుమతిస్తుందా అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే.. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా ఈ ఉత్తర్వులు జారీ చేశారన్నారు పిటిషనర్.
Read More : Kuppam : ప్రతిపక్ష నేత ఇలాఖాలో స్కూళ్లు..మురిసిపోతున్న చిన్నారులు
కొవిడ్ సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కొవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణుల హెచ్చరికలు పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో తెలిపారు. పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్ కూడా కాలేదన్నారు. అందువల్ల విద్యాశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం విచారణ జరపనుంది.
Read More : AP Schools : రేపటి నుంచి స్కూళ్లు.. గదిలో 20మందే, రోజు విడిచి రోజు క్లాసులు
దేశవ్యాప్తంగా 16 నెలల పాటు మూతబడిన స్కూళ్లు.. పలు రాష్ట్రాల్లో తెరుచుకున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒరిస్సా, ఏపీ సహా.. దేశంలోని 22 రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుకుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం సీనియర్ క్లాసులు నిర్వహిస్తున్నారు. స్కూల్లు తెరిచిన ప్రతి రాష్ట్రంలోనూ కేసులు పెరుగుతున్నాయి. చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. పక్క రాష్ట్రమైన ఏపీలోనూ.. స్కూళ్లపై కరోనా ఎఫెక్ట్ పడింది. బడుల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. స్కూళ్లను మూసేశారు అధికారులు. ఇలాంటి పరిస్థితుల్లో.. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లను పంపేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.