Kastruba College Gas Leak : కస్తూర్బా కాలేజ్ గ్యాస్ లీక్ ఘటన.. ఇద్దరు విద్యార్థినుల పరిస్థితి విషమం

సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కెమికల్ గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు విద్యార్థినులు తీవ్ర శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు తెలిపారు. మొత్తం 41 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో చేరగా.. 33 మంది కోలుకున్నారు.

Kastruba College Gas Leak : కస్తూర్బా కాలేజ్ గ్యాస్ లీక్ ఘటన.. ఇద్దరు విద్యార్థినుల పరిస్థితి విషమం

Updated On : November 18, 2022 / 7:35 PM IST

Kastruba College Gas Leak : సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కెమికల్ గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు విద్యార్థినులు తీవ్ర శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు తెలిపారు. మొత్తం 41 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో చేరగా.. 33 మంది కోలుకున్నారు. వారందరిని డిశ్చార్జి చేశారు. మరో 8మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

Also Read : Kastruba College Gas Leak : మిస్టరీగా కస్తూర్బా కాలేజ్ గ్యాస్ లీక్ ఘటన.. అసలేం జరిగింది? గ్యాస్ ఎలా లీక్ అయ్యింది?

శుక్రవారం మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో గ్యాస్ లీక్ ఘటన జరిగింది. కెమికల్ గ్యాస్ లీకేజీ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 41 మందిని కాలేజీ పక్కనే ఉన్న గీతా నర్సింగ్ హోమ్ కు తరలించి చికిత్స అందించారు. వీరిలో 33మంది విద్యార్థినులు కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం 8మందికి మాత్రం చికిత్స అందిస్తున్నారు. ఆ 8మందిలో ఇద్దరి పరిస్థితి కొంత సీరియస్ గా ఉంది. ఆ ఇద్దరూ ఆస్తమా ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ కారణంగా వారి పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ప్రమాదమేమీ లేదంటున్నారు. హెల్త్, విద్య, రెవెన్యూ శాఖ అధికారులు ఆసుపత్రికి వచ్చారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కెమికల్ గ్యాస్ రిలీజ్ కావడంతోనే ఇదంతా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యం బాధ్యత లేకుండా వ్యవహరించిందని, ఈ కారణంగానే ఇదంతా జరిగిందని మండిపడుతున్నారు.