బుర్జ్ ఖలీఫా మీద బాద్‌షా..

Shah Rukh Khan: కింగ్ ఖాన్.. షారూఖ్ ఖాన్ స్టైలే వేరు. ఆయన ఏం చేసినా సమ్‌థింగ్ డిఫరెంట్‌గానే చేస్తారు. సినిమాల విషయంలో కూడా అంతే. ఇండియన్ సినిమా హిస్టరీలోనే 4 ప్రెస్టీజియస్ ప్లేసెస్‌లో షూట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు షారూఖ్. మరి అవి ఎక్కడో, ఏంటో మనం కూడా చూద్దాం..
షారూఖ్ ఖాన్.. ఇండియన్ సినిమాలో ఆయనకున్న స్టైలే వేరు. జస్ట్ ఒక్క డైలాగ్‌తో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసే కెపాసిటీ ఉన్న స్టార్ హీరో. యాక్టింగ్‌తోనే కాదు సినిమా మీద తనకున్న ప్యాషన్‌తో కూడా ఆడియన్స్‌ని కట్టిపడేస్తారు షారూఖ్. అందుకే ఇండియన్ సినిమాలో ఎవ్వరూ చెయ్యని 4 టాప్ ప్లేసెస్‌లో షూటింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు ఈ బాలీవుడ్ బాద్‌షా. ‘స్వదేశ్’ సినిమాలో నాసా సైంటిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించారు షారూఖ్. స్పేస్ రీసెర్చ్ కంపెనీ నాసా లో ‘స్వదేశ్’ షూటింగ్ చేసి అక్కడి ఎట్మాస్పియర్ ఆడియన్స్‌కి చూపించారు ఈ స్టార్ హీరో.
నాసా సరిపోదన్నట్టు.. మరో సినిమాలో ఏకంగా డిస్కవరీ ఛానల్ హెడ్ క్వార్టర్స్‌లోనే షూటింగ్ చేశారు షారూఖ్ ఖాన్. ‘జబ్ తక్ హై జాన్’ సినిమాలో డిస్కవరీ ఛానల్ రిపోర్టర్‌గా కనిపించిన అనుష్క శర్మ.. షారూఖ్ లైఫ్ స్టోరీని ఛానల్‌లో ప్రజెంట్ చేస్తుంది. ఈ సీన్‌ని ఏకంగా డిస్కవరీ ఛానల్ హెడ్ క్వార్టర్స్‌లో షూట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ఈ రెండు టాప్ లొకేషన్స్‌ని మర్చిపోక ముందే.. ఏకంగా మేడమ్ టుస్సాడ్స్ మెయిన్ బ్రాంచ్‌లో తన సినిమా షూటింగ్ చేశారు షారూఖ్. ‘ఫ్యాన్’ సినిమాలో తన స్టాచ్యూని తనే చూసుకుంటూ చేసే సీన్ కోసం ఏకంగా లండన్‌లోని టుస్సాడ్స్ మ్యూజియం లొకేషన్‌కి వెళ్లారు టీమ్.
ఈ టాప్ లొకేషన్స్‌లోనే కాకుండా ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘పఠాన్’ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్ కోసం ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా మీదకు వెళుతున్నారు షారూఖ్ అండ్ టీమ్. బాలీవుడ్ బాద్‌షా అంటే అంతే.. ఏంచేసినా డిఫరెంటే అంటున్నారు ఫ్యాన్స్.