Kolkata : ‘టూ బ్రదర్స్’ పేరుతో షాపు నడుపుతున్న హిందూ-ముస్లిం
మతం వారి పనికి అడ్డు కాలేదు. మతం వారి అనుబంధానికి అడ్డు కాలేదు. కొన్నేళ్లుగా కలిసిమెలసి జీవిస్తున్నారు. 'టూ బ్రదర్స్' పేరుతో కోల్‌కతాలో షాపు నడుపుతున్న హిందూ-ముస్లిం కథ వైరల్ అవుతోంది.

Kolkata
Kolkata : ఆ ఇద్దరు భిన్న మతస్తులు. భిన్న సంప్రదాయాలు. ఒకరు హిందువు.. మరొకరు ముస్లిం. ఇద్దరూ కలిసి దుకాణం పెట్టుకున్నారు. కలిసి మెలసి పని చేసుకుంటూ అన్నదమ్ముల్లా జీవిస్తున్నారు. వారి షాప్ పేరు కూడా ‘టూ బ్రదర్స్’ . వీరి కధ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఒక హిందువు, ఒక ముస్లిం కలిసి కోల్‌కతాలో కొన్నేళ్లుగా షూలు, లెదర్ బ్యాగ్‌లు రిపేర్ చేసే దుకాణం నడుపుతున్నారు. ఆ షాపు పేరు ‘టూ బ్రదర్స్’.. Debotri Ghosh అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వారి షాపు ఫోటో వైరల్ అవుతోంది. ఫోటోలో వారిద్దరూ కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. బూట్లు అరలలో వరుసగా ఉన్నాయి. కోల్‌కతాలోని కుద్‌ఘాట్‌లో ఉన్న ఈ షాపు చాలా చిన్నది. అయినప్పటికీ కొన్నేళ్లుగా వీరు ఈ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నారట. ఈ ఫోటో వైరల్ అవుతోంది.
Rahul Gandhi : కర్ణాటకలో ప్రేమ దుకాణం తెరుచుకుంది.. ప్రతి రాష్ట్రంలో ఇదే రిపీట్ అవుతుంది
‘నేను ఎప్పుడూ నా షూ రిపేరు కోసం ఈ దుకాణానికే వెళ్తాను’ అని ఒకరు.. ‘ఏ మతం అయితే ఏంటి వీరి స్నేహం చాలా గొప్పది’ అని మరొకరు.. ‘నేను ఈ షాపు దగ్గర 5 నిముషాలు ఆగాను.. ఎంతో ఆనందం అనిపించిందని’ వరుసగా కామెంట్లు చేశారు. నిజంగానే వీరి స్నేహం ఎంతో గొప్పగా.. అందంగా ఉందని ఇలాగే ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
A neighborhood shop run by a Hindu and a Muslim. The name of the store is ‘Two Brothers’. With time, the shop that repairs shoes and leather bags have become smaller.. But still exists. 💙 pic.twitter.com/fpyDDwzfXd
— Debotri Ghosh (@DebotriG) June 4, 2023