Viral Video: ఈ కుక్క తెలివికి నెటిజన్లు ఫిదా..

ఒకేసారి ఆ కుక్క తెలివితేలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యజమాని కంటే రెండు రెట్లు ఎక్కువేనంటు స్మార్ట్ డాగ్ తెలివేంటో చూడండీ..

Viral Video: ఈ కుక్క తెలివికి నెటిజన్లు ఫిదా..

Smart Dog Finds A Way To Carry Four Tyres At Once While (1)

Updated On : December 20, 2021 / 10:20 AM IST

Smart dog finds a way to carry four tyres at once while : తెలివితేటల్లో జంతువులు వేటికవే అని చెప్పాలి. ఆయా సందర్భాల్ని బట్టి వాటి తెలివిని ఉపయోగిస్తాయి. అలా మనిషితో స్నేహంగా, సొంత మనిషికంటే ఎక్కువగా ఉండే కుక్కలు వాటి యజమానుల కోసం ప్రాణాల్ని కూడా పణ్ణంగా పెట్టిన ఘటనలు కోకొల్లలు.కుక్కలకు విశ్వాసమే కాదు తెలివితేటలు కూడా ఉంటాయని ఎన్నో సందర్బాల్లో తెలిసింది. అలా ఓ కుక్క తన యజమానికంటే నేను ఒకటి కాదు రెండు రెట్లు ఎక్కువేనంటోంది. ఓకుక్క టైర్లు మోసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకేసారి ఆ కుక్క ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు టైర్లను మోసుకెళ్లిన తీరు వారెవ్వా..ఎంత తెలివిరా బాబూ దీనికి అనిపిస్తోంది. తన యజమాని రెండు చేతులతోను రెండు టైర్లు పట్టుకెళ్లటం చూసిన ఆ కుక్క ఎంతో తెలివి ఉపయోగించి ఎంతో చాకచక్యంగా తన నోటితో ఒకేసారి నాలుగు టైర్లను మోసుకెళ్లటం చూస్తే ఎవ్వరైనా మెచ్చుకుంటారు ఈ కుక్క తెలివితేటల్ని..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక కుక్క తన యజమానికి పనిలో సహాయం చేస్తోంది. తన పనిని సులభం చేయటానికి ఉపయోగించే ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

ఈ వీడియోలో కుక్క తన యజమానికి షెడ్ లో ఉన్న టైర్లను వేరే చోటికి తీసుకెళ్లటం చూసింది. రెండు టైర్లు ఒకేసారి నాలుగు టైర్లను ఎలా తీసుకువెళ్లాలో ఆలోచించింది. ఆ కుక్క యజమాని దాని ముందు నాలుగు టైర్లు తీసుకొచ్చిపెట్టాడు. మొదట కుక్క వాటిని కాసేపు చూసి..నోటితో వాటిని పట్టుకోవడానికి వాటిని ఒకచోట చేర్చడానికి ప్రయత్నిస్తుంది. అలా ఎలాగైతేనే నాలుగు టైర్లను ఒకేచోట చేర్చింది. కాని నాలుగింటిని పట్టుకెళ్లటానికి దానికి వీలు పడలేదు. అక్కడు కుక్క తెలివితేటలు చూపింది. ఒకదానిపై మరొక టైరును కాస్త గ్యాప్ తో పెట్టింది.

అలా నాలుగింటిని భలే చాకచక్యంగా పేర్చింది. ఆ తరువాత వాటిని పట్టుకెళ్లటానికి దాని స్ట్రాటజీని భలే ఉపయోగించింది. డాగీ తన పనిని ఎలా విజయవంతంగా పూర్తి చేస్తుందో చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఈ వీడియోని నెటిజన్లు భలే లైక్ చేస్తున్నారు. నిజమే మనిషికంటే రెండు రెట్లు ఎక్కువే అని తీరాల్సిందే..