18 Pages: ‘టైమ్ ఇవ్వు పిల్ల’ అంటూ శింబు చితక్కొట్టేందుకు రెడీ అయ్యాడుగా!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘18 పేజెస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కిస్తుండగా, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Sneak Peek Of Time Ivvu Pilla Song Of Simbu From 18 Pages Goes Viral
18 Pages: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘18 పేజెస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కిస్తుండగా, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ మూవీపై అంచనాలను క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
18 Pages Movie: 18 పేజీల్లో ఫస్ట్ పేజీకి డేట్ ఫిక్స్ చేశారుగా!
ఇక ఈ పాటను తమిళ స్టార్ హీరో శింబు పాడుతుండటంతో ఈ పాట ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి తెలుగు ఆడియెన్స్‌లో నెలకొంది. గతంలోనూ శింబు పాడిన పాటలు ఇక్కడ మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈసారి శింబు ఎలాంటి పాటతో వస్తున్నాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా, 18 పేజెస్ చిత్ర యూనిట్ ఈ పాటకు సంబంధించిన స్నీక్ పీక్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో శింబు నిఖిల్ కోసం పాట పాడేందుకు రావడం.. తెలుగు పదాలను చూసి, ఆడియెన్స్ తనను అంగీకరించరని అంటుంటాడు. అయితే నిఖిల్ మాత్రం ఈ పాట శింబు వాయిస్‌లో వేరే లెవెల్‌లో ఉంటుందని, ఈ పాట ఖచ్చితంగా చార్ట్‌బస్టర్ అవుతుందనే ధీమాను వ్యక్తం చేశాడు. ఈ పాటను డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
కాగా, శింబు ఈ పాటను పాడుతున్న తీరు నిజంగా అద్భుతంగా ఉండటంతో ఈ పాట రిలీజ్ తరువాత ఇది ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Here’s a sneak peek of #TimeIvvuPilla song recording with @SilambarasanTR_ ?
Stay tuned… Full song on DEC 5th!?#ThankYouSTR ~ #STRFor18Pages ?#18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap @GopiSundarOffl #BunnyVas @lightsmith83 @NavinNooli @adityamusic pic.twitter.com/Z57yQwsWqw
— Geetha Arts (@GeethaArts) November 29, 2022