18 Pages : కార్తికేయ 2 హిట్ తర్వాత.. క్రిస్మస్ కానుకగా ’18 పేజెస్’.. రిలీజ్ డేట్ లీక్ చేసేసిన డైరెక్టర్..

తాజాగా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మొదలైందంటూ సెట్ లో నిఖిల్ అందరితో కలిసి దిగిన ఓ ఫోటోని దర్శకుడు సూర్య ప్రతాప్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..........

18 Pages : కార్తికేయ 2 హిట్ తర్వాత.. క్రిస్మస్ కానుకగా ’18 పేజెస్’.. రిలీజ్ డేట్ లీక్ చేసేసిన డైరెక్టర్..

Nikhi Movie 18 Pages releasing date revelead

18 Pages :  ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నిఖిల్. సైలెంట్ గా వచ్చి దేశమంతటా భారీ విజయం సాధించి దాదాపు 120 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది ఈ సినిమా. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా నిఖిల్ కి మంచి మార్కెట్ వచ్చింది. నిఖిల్ తర్వాతి సినిమా ’18 పేజెస్’. ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కొంత షూటింగ్ అయిపోయి మధ్యలో ఆగింది.

తాజాగా ’18 పేజెస్’ షూటింగ్ మొదలైంది. చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది ప్రస్తుతం. సుకుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించగా తనదగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సూర్య ప్రతాప్ ని దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాని సుకుమార్, గీత ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. కార్తికేయ 2 తర్వాత ఇందులో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Priyadarshi : కొమరం భీం బయోపిక్ లో నటించాలి.. వీళ్లందరి బయోపిక్స్ తీయాలి..

తాజాగా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మొదలైందంటూ సెట్ లో నిఖిల్ అందరితో కలిసి దిగిన ఓ ఫోటోని దర్శకుడు సూర్య ప్రతాప్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కార్తికేయ 2 భారీ విజయం తర్వాత నిఖిల్ మళ్ళీ సెట్స్ కి వచ్చాడు. ’18 పేజెస్’ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తాము అని పోస్ట్ చేశాడు. ఈ సినిమా లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కావడం. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ మార్కెట్ పెరగడంతో ’18 పేజెస్’ మీద కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.