Solar Eclipse: రేపు ఆకాశంలో అద్భుతం.. ఎక్కడెక్కడ కనిపిస్తుందో తెలుసా?
మన అంతరిక్షం ఓ అద్భుతం. అందులో కూడా అప్పుడప్ప్పుడు ప్రత్యేకమైన అద్భుతాలు చోటుచేసుకుంటుంటాయి. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ముగిసిన రెండో వారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరానికి ఇవి తొలి సూర్యగ్రహణ రోజులు కాగా ఈ గురువారం ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది.

Solar Eclipse Awesome In The Sky Tomorrow Do You Know Where It Will Appear
Solar Eclipse: మన అంతరిక్షం ఓ అద్భుతం. అందులో కూడా అప్పుడప్ప్పుడు ప్రత్యేకమైన అద్భుతాలు చోటుచేసుకుంటుంటాయి. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ముగిసిన రెండో వారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరానికి ఇవి తొలి సూర్యగ్రహణ రోజులు కాగా ఈ గురువారం ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఈనెల 10న ఏర్పడనుంది. దీనిని ఖగోళ అద్భుతంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. దీన్నే సూర్యగ్రహణంగా పిలుస్తారు.
ఈ అద్భుతం దృశ్యం పలు దేశాల్లో కనిపించనుండగా.. కొన్ని దేశాల్లో మాత్రమే రింగ్ ఆఫ్ ఫైర్ దర్శనమివ్వనుంది. సూర్యగ్రహణం భారత్‌లో మాత్రమే పాక్షికంగా కనిపించనుండగా అది కూడా కేవలం అరుణాచల్ ప్రదేశ్‌లో మాత్రమే సూర్యాస్తమయం సమయంలో కనిపిస్తుందని మధ్యప్రదేశ్‌లోని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్‌లో ఈ సూర్యగ్రహణం మధ్యహ్నం ఒంటిగంటా 42 నిమిషాలకు ఆరంభమౌతుండగా సాయంత్రం 6:41 నిమిషాలకు ఇది ముగుస్తుంది. గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తి ఆ ఛాయ తొలగిపోవడానికి దాదాపు ఆరు గంటల పాటు పడుతుంది.
టైమ్ అండ్ డేట్ అనే వెబ్‌సైట్ వేసిన అంచనాల ప్రకారం.. రష్యా, గ్రీన్‌ల్యాండ్, కెనడా ఉత్తర ప్రాంతాలలో పాక్షికంగా కనిపిస్తుంది. ఆసియా ఉత్తర ప్రాంత దేశాలు, ఆఫ్రికా పశ్చిమ ప్రాంత దేశాలు, అట్లాంటిక్, ఆర్కిటిక్, యూరప్, అమెరికా దేశాల్లోనూ పాక్షికంగా దర్శనమిస్తుందని చెప్తున్నారు. సూర్యగ్రహణం ఉచ్ఛస్థితికి చేరినప్పుడు ఏర్పడే రింగ్ ఆఫ్ ఫైర్ గ్రీన్‌లాండ్, సెర్బియాతో పాటు ఉత్తర ధృవానికి చివరన ప్రాంతాల్లో కూడా కనిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది డిసెంబర్ 4న మరో సూర్యగ్రహణం ఏర్పడనుంది.