Reservation In India : మతం మారిన వారికి రిజర్వేషన్లు రద్దు చేయాలి : VHP డిమాండ్
రిజర్వేషన్లు పొందిన తరవాత క్రైస్తవంలోకి మారిన షెడ్యూల్డ్ కులాలు, తెగలవారి రిజర్వేషన్లను రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

Stop reservation benefits to Hindus who convert to Christianity
Reservation In India : భారత్ పలు కులాలు..మతాల కలయిక. మతం మార్పిడి కూడా సర్వసాధారణం జరుగుతుంటాయి. అలా హిందువులు క్రైస్తవ మతం స్వీకరించటం జరుగుతుంటుంది. అలా మతం మార్చుకున్నవారు హిందువులా? లేక క్రైస్తవులా? మతం మార్చుకుంటే భారత రాజ్యాంగం కల్పించే రిజర్వేషన్లు వర్తిస్తాయా? అంటే అలా వర్తించకూడదని విశ్వహిందూ పరిషత్ అంటోంది. అంతేకాదు మతం మారిన వారికి రిజర్వేషన్లు రద్దు చేయాలని బుధవారం (అక్టోబర్ 19,2022) డిమాండ్ చేస్తోంది.
హిందువులమని చెప్పుకొని రిజర్వేషన్లు పొందిన తరవాత క్రైస్తవంలోకి మారిన షెడ్యూల్డ్ కులాలు, తెగలవారి రిజర్వేషన్లను రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) జాతీయ ప్రతినిధి విజయ్ శంకర్ తివారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రైస్తవ మతంలోకి మారిన తరవాత కూడా హిందూ పేర్లు, ఇతర వివరాలను మార్చుకోనివారెందరో ఉన్నారని అన్నారు. ఇటువంటివారిపై కేంద్రం దృష్టి సారించాలని..ఓ ప్రణాళిక రూపొందించి సర్వే జరపాలని కోరారు. ఈ అంశంపై వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా జాగృతి కార్యక్రమాన్ని చేపడుతుందని తెలిపారు.
దీనిపై వీహెచ్‌పీ స్థానిక అధికార ప్రతినిధి ప్రభాత్ శర్మ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ పేర్లు, ఇతర ఆధారాలను మార్చుకోనివారు చాలామంది ఉన్నారని..ఈ పత్రాల ఆధారంగానే రిజర్వేషన్లు పొందుతున్నారని మతం మార్చుకున్నవారికి రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.