AC causing Obecity : ఏసీలో ఉంటే లావవుతారు…?

ఎయిర్ కండిషనింగ్ వల్ల లావవుతారా.. అలా ఎలా? అని ఆశ్చర్యపోతున్నారా? ఆకలికి, ఉష్ణోగ్రతకి మధ్య సంబంధం ఉందట. అదేంటో చదవండి.

AC causing Obecity : ఏసీలో ఉంటే లావవుతారు…?

AC causing Obecity

Updated On : July 12, 2023 / 3:44 PM IST

AC causing Obecity : అప్పటిదాకా ఇంటి పట్టున ఉన్నవారు.. ఏసీ అలవాటు లేని వారు కొంతకాలంగా ఏసీలో చోట పనిచేస్తున్నారు అనుకోండి.. సడెన్‌గా వారిలో బరువు పెరగడం మొదలైంది. సాధారణంగా కష్టపడి పనిచేస్తుంటే ఇంత బరువు ఎందుకు పెరుగుతున్నాను అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. అందుకు కారణం ‘ఎయిర్ కండిషనింగ్’ అట. సాంచెజ్ పెరోనా అనే పరిశోధకుడు ఎయిర్ కండిషనింగ్ వల్ల ఊబకాయం వస్తుందని చెబుతున్నారు.

Obesity and Cancer : ఊబకాయంతో క్యాన్సరు వచ్చే ప్రమాదం ఉందా ?

స్పెయిన్‌లోని ‘ఫ్యాట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది హయ్యర్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌’లో పరిశోధకుడు ఉన్న జేవియర్ సాంచెజ్ పెరోనా ఏసీ వల్ల లావవుతారు అని చెబుతున్నారు. ఎందుకంటే చల్లని వాతావరణంలో ఎక్కువగా ఆకలి వేస్తుందట. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకలి తక్కువగా ఉంటుందట. అందువల్ల ఏసీలో ఉంటున్నప్పుడు ఎక్కువగా ఆహారం తీసుకుంటాం.. దాంతో బరువు పెరుగుతాం అని చెబుతున్నారు.

Eat Breakfast : ఉదయం అల్పాహారం తినకుంటే ఊబకాయం బారిన పడే ప్రమాదం?

ఉష్ణోగ్రత, ఆకలి మధ్య సంబంధంపై అనేక పరిశోధనలు జరిగాయి. 1963 లో ఎలుకలపై జరిగిన ఓ పరిశోదనలో అవి కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలో తక్కువ తింటాయని నిర్ధారించారట. 35 డిగ్రీల వద్ద 24 డిగ్రీల వద్ద తిన్న దానిలో 10% తిన్నాయట. అలాగే 40 డిగ్రీల వద్ద అవి తినడం మానేశాయట. యునైటెడ్ స్టేట్స్‌లోని బర్మింగ్ హామ్ యూనివర్సిటీ ప్రచురించిన మరో అధ్యయనంలో కూడా ఉష్ణోగ్రత పెరిగిన ప్రతి సారి మనుష్యులు తమకు ఇచ్చిన ఫుడ్ లో 85.9 కేలరీలు తక్కువగా తింటారని తేలిందట. ఈ పరిశోధనల ప్రకారం ఏసీలో ఉంటూ ఆకలితో ఎక్కువ తినడం వల్ల ఒబెసిటీ వస్తుందనేది నిజమని నిర్ధారణ అవుతోంది.