Super Star Krishna : సుధీర్ బాబు ఇంట్లో కృష్ణ గారి బర్త్‌డే సెలబ్రేషన్స్..

సుధీర్ బాబు ఇంట్లో జరిగిన కృష్ణ గారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో, కృష్ణ గారి సతీమణి ఇందిర గారు, తమ్ముడు ఆదిశేషగిరి రావు, అల్లుడు గల్లా జయదేవ్, నరేష్, సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు..

Super Star Krishna : సుధీర్ బాబు ఇంట్లో కృష్ణ గారి బర్త్‌డే సెలబ్రేషన్స్..

Super Star Krishna Birthday Celebrations With Family

Updated On : May 31, 2021 / 3:41 PM IST

Super Star Krishna: సూపర్ స్టార్, నట శేఖర, ఘట్టమనేని శివరామ కృష్ణ.. ఆయన సాహసానికి మారుపేరు.. ఆయన మాట తప్పని, మడమ తిప్పని మనిషి.. అల్లూరి పాత్రలో తెలుగు ప్రేక్షకుల మనసులు పులకరింపజేశారు.. ఆయనే సూపర్ సార్ కృష్ణ గారు.. మే 31న కృష్ణ గారి పుట్టినరోజు..

Mahesh Babu : కృష్ణ గారి పుట్టిన‌రోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజలకు కోవిడ్ -19 టీకాలు వేయించిన‌ మహేష్ బాబు..

ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, కృష్ణ – మహేష్ బాబు అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు సూపర్ స్టార్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. కృష్ణ గారి పుట్టినరోజు వేడుకను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు ఆయన చిన్నల్లుడు, యంగ్ హీరో సుధీర్ బాబు..

సుధీర్ బాబు ఇంట్లో జరిగిన కృష్ణ గారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో, కృష్ణ గారి సతీమణి ఇందిర గారు, తమ్ముడు ఆదిశేషగిరి రావు, అల్లుడు గల్లా జయదేవ్, నరేష్, సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కృష్ణ గారి చేత కేక్ కట్ చేయించి, విషెస్ తెలియజేశారు..