Superstar Krishna Passed Away Live Update: గచ్చిబౌలి స్టేడియంకు కృష్ణ భౌతికకాయం.. రేపు ఉదయం నివాళులు అర్పించనున్న సీఎం జగన్
తెలుగు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కార్డియాక్ అరెస్ట్ కు గురికావడంతో నిన్న ఆయన్ను కాంటినెంటల్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేశారు. కాగా, నేడు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారనే వార్తను హాస్పిటల్ వర్గాలు అఫీషియల్ గా అనౌన్స్ చేశాయి. ఇక కృష్ణ మృతి పట్ల యావత్ సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. అటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం కృష్ణ మృతిపై తమ విచారణ వ్యక్తం చేస్తున్నారు.

Superstar Krishna mortal remains to be kept at Gachibowli stadium
Superstar Krishna: తెలుగు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కార్డియాక్ అరెస్ట్ కు గురికావడంతో నిన్న ఆయన్ను కాంటినెంటల్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేశారు. కాగా, నేడు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారనే వార్తను హాస్పిటల్ వర్గాలు అఫీషియల్ గా అనౌన్స్ చేశాయి. ఇక కృష్ణ మృతి పట్ల యావత్ సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. అటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం కృష్ణ మృతిపై తమ విచారణ వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నానక్ రామ్ గూడలోని నివాసంలో కృష్ణ భౌతికకాయానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రేపు కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. అయితే మరికాసేపట్లో కృష్ణ భౌతికకాయాన్ని విజయకృష్ణ నివాసం నుంచి గచ్చిబౌలి స్టేడియంకు తరలించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అక్కడ రేపు మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.
అయితే రేపు ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం వైఎస్.జగన్ గచ్చిబౌలి స్టేడియంలో కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పిస్తారని అధికారులు తెలిపారు. ఆ తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు గచ్చిబౌలి నుంచి పద్మాలయ స్టూడియోకు కృష్ణ భౌతికకాయాన్ని తరలించనున్నారు. పద్మాలయలో పూజలు నిర్వహించిన అనంతరం మహాప్రస్థానంకు అంతిమ యాత్రగా కృష్ణ భౌతికకాయాన్ని తరలించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.