Taapsee Pannu : మరోసారి టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ

తాజగా బ్లర్ సినిమా ప్రమోషన్స్ లో తాప్సీ మాట్లాడుతూ.. ''నేను ఏం మాట్లాడినా ఆలోచించే మాట్లాడుతాను. నా వ్యాఖ్యలని ఆలోచించకుండా తప్పుగా అర్థం చేసుకుంటారు. నాకు పొగరు అని కామెంట్స్ చేస్తారు. నన్ను ట్రోల్ చేస్తున్నారు . ప్రస్తుతం నేను............

Taapsee Pannu : మరోసారి టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ

Taapsee Pannu comments on Tollywood

Updated On : November 28, 2022 / 9:30 AM IST

Taapsee Pannu :  ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడికి చెక్కేసింది. బాలీవుడ్ లో తాప్సీకి కమర్షియల్ సక్సెస్ లు రాకపోయినా వరుస సినిమా ఆఫర్స్ అయితే వస్తున్నాయి. దీంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయిపొయింది ఈ భామ.

ఇటీవలే ఎక్కువ కంటెంట్ ఓరియెంటెడ్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ కంగనా లాగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ట్రై చేస్తుంది. త్వరలో బ్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది తాప్సీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే గతంలో తాప్సీ టాలీవుడ్ పై విమర్శలు చేసింది. అప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు తాప్సీని బాగా ట్రోల్ చేశారు.

Adivi Sesh : 26/11… ముంబైలో నివాళులు అర్పించిన మేజర్..

తాజగా బ్లర్ సినిమా ప్రమోషన్స్ లో తాప్సీ మాట్లాడుతూ.. ”నేను ఏం మాట్లాడినా ఆలోచించే మాట్లాడుతాను. నా వ్యాఖ్యలని ఆలోచించకుండా తప్పుగా అర్థం చేసుకుంటారు. నాకు పొగరు అని కామెంట్స్ చేస్తారు. నన్ను ట్రోల్ చేస్తున్నారు . ప్రస్తుతం నేను వరుస సినిమాలు చేస్తున్నాను. టాలీవుడ్ లో కంటే ఇక్కడే నాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి” అని అంది. దీంతో అసలు తాప్సీకి అవకాశం ఇచ్చిందే టాలీవుడ్ ఇండస్ట్రీ అని, అలాంటి ఇండస్ట్రీని ఎలా విమర్శిస్తావు అంటూ నెటిజన్లు తాప్సీని మరోసారి ట్రోల్ చేస్తున్నారు.