Tamannaah : ముంబైలో గణేషుడికి తమన్నా స్పెషల్ పూజలు.. మూడేళ్ళ తర్వాత దర్శించుకున్నా అంటూ పోస్ట్..

బాబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా, మధుర్ బండార్కర్ కలిసి ముంబైలోని ఫేమస్ గణేష్ మండపం లాల్‌బాగ్‌లోని లాల్ బాగ్చా రాజా గణేషుడిని దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా.............

Tamannaah : ముంబైలో గణేషుడికి తమన్నా స్పెషల్ పూజలు.. మూడేళ్ళ తర్వాత దర్శించుకున్నా అంటూ పోస్ట్..

Tamannaah special worships to lord vinayaka

Updated On : September 4, 2022 / 11:26 AM IST

Tamannaah :
ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది తమన్నా. ఇప్పటికి కూడా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో వరుస ఛాన్సులు సాధిస్తుంది ఈ మిల్కీ బ్యూటీ. త్వరలో బాలీవుడ్ లో బాబ్లీ బౌన్సర్ అనే సినిమాతో రాబోతుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ లో ‘బబ్లీ బౌన్సర్’ తెరకెక్కుతుంది. డిస్నీప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

బాబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా, మధుర్ బండార్కర్ కలిసి ముంబైలోని ఫేమస్ గణేష్ మండపం లాల్‌బాగ్‌లోని లాల్ బాగ్చా రాజా గణేషుడిని దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాకి ఫోజులిచ్చారు.

Akkineni Amala : శర్వానంద్ నా మూడో కొడుకు.. పదేళ్ల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నా..

Tamannaah special worships to lord vinayaka

 

ఈ గణేష్ మండపం దగ్గర దిగిన ఫోటోలని తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”ఎక్కడున్నా, ఎలాంటి వర్క్ లో ఉన్నా కచ్చితంగా లాల్ బాగ్చా రాజా గణేశుడ్ని దర్శించుకుంటాను. కానీ గత మూడు సంవత్సరాలుగా కుదర్లేదు. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వినాయకుడ్ని దర్శించుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది” అంటూ పోస్ట్ చేసింది. దీంతో తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.