Mt Everest : ఎవరెస్టు అధిరోహిస్తూ మంచు పగుళ్లలో చిక్కుకుపోయిన షెర్పా.. ధైర్య, సాహసాలతో కాపాడిన అధిరోహకుల బృందం

ఎవరెస్టు అధిరోహించడం అంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఎన్నో సవాళ్లు అధిగమిస్తూ ముందుకు సాగాలి. అందుకు గుండె ధైర్యం కావాలి. తన ప్రాణాలు రక్షించుకుంటూ తోటివారి ప్రాణాలు కాపాడే తెగువ కావాలి. మంచు పగుళ్లలో చిక్కుకుపోయిన ఓ షెర్పాను అధిరోహకుల బృందం ప్రాణాలకు తెగించి ధైర్య, సాహసాలతో కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Mt Everest : ఎవరెస్టు అధిరోహిస్తూ మంచు పగుళ్లలో చిక్కుకుపోయిన షెర్పా.. ధైర్య, సాహసాలతో కాపాడిన అధిరోహకుల బృందం

Mt Everest

Updated On : June 11, 2023 / 10:58 AM IST

Mt Everest : మౌంట్ ఎవరెస్టు అధిరోహించే సమయంలో పర్వాతారోహకులకు అనేక సవాళ్లు ఎదురౌతాయి. ఒక్కోసారి కొందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. ప్రాణాలకు తెగించి క్లైంబర్స్ ముందుకు సాగుతుంటారు. తాజాగా ఒక షెర్పా మంచు పగుళ్లలో చిక్కుకుపోయాడు. అధిరోహకుల బృందం అతని ప్రాణాలు కాపాడింది. ప్రపంచానికి తెలియని ఇలాంటి కథనాలు ఎన్నో ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. తాజా కథనం ట్విట్టర్ లో షేర్ కావడంతో ప్రపంచానికి తెలిసింది.

Mount Everest : ఎవరెస్టు శిఖరమా? డంపింగ్ యార్డా? .. ఐఏఎస్ ఆఫీసర్ షేర్ చేసిన వీడియో వైరల్
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే సమయంలో షెర్పా పగుళ్లలో పడి ఎలా రక్షించబడ్డాడో తెలిపే వీడియోను Gesman Tamang అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ‘క్యాంప్ 1 మరియు క్యాంప్ 2 మధ్య చీలికలో పడిపోయిన షెర్పాను మేము విజయవంతంగా రక్షించాము. అతను ప్రాణాలతో బయటపడటం నిజంగా అద్భుతం. ఈ కథనం ఎవరెస్టు ఎక్కే పర్వాతారోహకుల త్యాగాలు, నష్టాలను గుర్తు చేస్తుంది’ అని తమంగ్ వీడియోను షేర్ చేశారు.

 

 

ఎవరెస్టు శిఖరంపై అనేకమైన రెస్క్యూలు జరుగుతుంటాయి. అయితే విదేశీ పర్వతారోహకుల రెస్క్యూలు ఎక్కువగా ఫోకస్ అవుతుంటాయి. చీకటి లోపల నడుము లోతు మంచులో కూరుకుపోయిన షెర్పాను రక్షించడానికి మరొక వ్యక్తి మంచును తవ్వడం కనిపిస్తుంది. ప్రాణాలకు తెగించి అతనిని తోటి పర్వతారోహకులు రక్షించారు. ఈ వీడియో చూసి అనేకమంది స్పందించారు.

Mt Everest : ఆమె గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి.. పేస్‌మేకర్‌తో ఎవరెస్టు ఎక్కి రికార్డ్ కొట్టాలనుకుంది.. చివరికి..

‘మీరు సూపర్ హ్యూమన్ లు’ అని ఒకరు.. ‘అతను బతికి బయటపడటం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది.. అతనిని రక్షించడానికి ప్రయత్నించిన వారందరకీ కూడా ఇదీ భయంకరమైన పరీక్ష’ అంటూ వరుసగా కామెంట్లు పెట్టారు. నిజమే వీడియోలో అక్కడి వాతావరణం చూస్తుంటే ధైర్య సాహసాలతో కూడిన ప్రయాణం.. అంతే కాదు మరొకరి ప్రాణాలు కాపాడటం అంటే తమ ప్రాణాలు కూడా లెక్కచేయకుండా రక్షించడం. షెర్పాను రక్షించిన టీం గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి.