తెలంగాణ హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ : ఇంట్లో ఎలా ఉండాలి..వ్యాధి వస్తే ఏం చేయాలి

తెలంగాణ ప్రభుత్వం హోం క్వారంటైన్ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. గాలి, వెలుతురు ఉన్న గదిలో రోగిని ఉంచాలని… అతనికి ప్రత్యేకమైన మరుగుదొడ్డి ఉండాలని గైడ్‌లైన్స్‌లో తెలిపారు. రోగి ఉంటున్న ఇంట్లో చిన్నారులు, 55 సంవత్సరాల పైబడినవారు, గర్భిణీలు ఉండకూడదన్నారు. రోగి వాడిన బెడ్‌షీట్స్, టవర్స్‌ను డెట్టాల్ వేసి అరగంట నానబెట్టాలని గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు. రోగికి సేవలందించే వారు 3 పొరల మెడికల్ మాస్క్ ధరించాలన్నారు. రోగితో ఉన్నప్పుడు ముక్కు, నోరు, కళ్లు తాకవద్దని గైడ్‌లైన్స్‌లో తెలిపారు.
రోగికి సేవలందించడానికి వెళ్లే ముందు.. వచ్చిన తర్వాత 40నుంచి 60 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలని గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు. రోగి వాడిన ఏ వస్తువునైనా 30 నిమిషాల పాటు వేడి నీళ్లలో ఉంచి శుభ్రం చేయాలని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు వైద్యుల సూచనల మేరకు హైడ్రాక్సిక్లోరోక్విన్ టాబ్లెట్స్ తీసుకోవాలన్నారు.
రోగి ప్రతిరోజు తనని తాను గమనించుకుంటూ ఉండాలని.. ప్రతిరోజు జ్వరంతోపాటు పల్స్‌రేట్ చేక్ చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. వ్యాధి లక్షణాలు కనిపించినా లేదా వ్యాధి నిర్ధారించిన వ్యక్తి 17రోజులపాటు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలని సూచించారు. కరోనా సోకిన వ్యక్తి బ్రౌన్ రైస్, గోధుమపిండి, చిరుధాన్యాలు తీసుకోవడం మంచిదన్నారు. ఆహారంలో బీట్‌రూట్, క్యారెట్‌తో పాటు పండ్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అలాగే రోజుకు కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీళ్లు తాగాలని… వెన్న తీసిన పాలు, పెరుగును తీసుకోవడం మంచిదని గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు.
Read: Coronavirus తెలంగాణ వాసులు జాగ్రత్త : జులై నాటికి 60 వేల కేసులు!