RTA m-Wallet యాప్ తో ప్రయోజనాలు..డౌన్ లౌడ్ చేసుకోండి

telangana-RTA-m-Wallet
దేశంలోనే మొదటిసారి ఆర్టీఏ ఎం వ్యాలెట్ యాప్ రూపొందించిన రాష్ట్రం ఏదంటే..తెలంగాణ రాష్ట్రం అని చెప్పవచ్చు. వాహనదారుల ఇబ్బందులు, ఇతర సమస్యలు తొలగించేందుకు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా యాప్ తీసుకొచ్చింది. వివిధ రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఇప్పుడు వినియోగిస్తున్న వాహనదారుల సంఖ్య రాష్ట్రంలో 50 లక్షలు దాటడం విశేషం. రాష్ట్ర రవాణా శాఖ..మొబైల్ యాప్ ఎం – వాలెట్ 2016 ఫిబ్రవరి 23 నుంచి అమల్లోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ద్వారా సంబంధిత పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడం, సోదాల సమయం లో పోలీసులకు చూపించే అవకాశం కల్పించింది.
దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎం వ్యాలెట్ లో నమోదు చేసుకున్న తర్వాత…వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ పొగొట్టుకున్నా..బాధ పడకుండా..యాప్ ను రూపొందించడం విశేషం. వాహనానికి సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌ను ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇతరుల మొబైల్ నుంచి చూసుకోవచ్చు.
ఒకవేళ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన సమయంలో..ఆ వాహనం ఎవరి పేరుపై ఉంది.. నడిపిన వ్యక్తి అసలు యజమానా.. కాదా అనే విషయం ఎం-వ్యాలెట్‌లో ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తి వాహన యజమాని కాకపోతే అతడి ఫోన్ నంబరుకు సమాచారం చేరుతుంది.
ఈ చలానా కూడా తెలంగాణ ఆర్టీఏ ఎం – వ్యాలెట్ లో చూడవచ్చు. పెండింగ్ చలానాలు, గతంలో కట్టిన చ లానాల వివరాలు కూడా కనిపిస్తాయి. చలాన్‌ను కట్టే అవకాశాన్ని ఇందులో కల్పించారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా జరిమానా చెల్లించే వ్యవస్థను ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌కు అనుసంధానం చేశారు.
యాప్‌ను డౌన్‌లోడ్ :-
గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలుత ఎం-వ్యాలెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
తర్వాత..మొబైల్ నంబరు, మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.
అందులో ఆర్సీ ఆప్షన్‌ను క్లిక్ చేసుకోవాలి.
డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబరు, వాహనం చాసిస్ నంబరుకు సంబంధించిన చివరి ఐదు డిజిట్స్‌ను నమోదు చేసి గెట్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆర్సీ, పొల్యూషన్, పర్మిట్, ఇన్సూరెన్స్ తదితర ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలు మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, రెండో వరుసలో పుట్టిన తేదీని నమోదు చేయాలి. కింది భాగంలో చిన్న మార్క్‌పై క్లిక్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా శాఖ కార్యాలయాలు కనిపిస్తాయి.
అందులో జిల్లాను సెలెక్ట్ చేసుకొని గెట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఒరిజనల్ డ్రైవింగ్ లైసెన్స్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అలాగే, యాప్‌లోని ఆర్సీ కార్డుగానీ, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను ఇతర మొబైల్‌కు షేర్ చేసుకొనే అవకాశం కూడా కల్పించారు.
Read: కల్నల్ సంతోష్ అంత్యక్రియల్లో భౌతిక దూరం..కోవిడ్ నిబంధనలు