Thala Ajith Kumar : ముచ్చటగా మూడోసారి.. ‘వలిమై’ విడుదలకు ముందే ‘తల’ 61 ప్రారంభం..!

‘వలిమై’ విడుదల కాకముందే మళ్లీ అదే దర్శకుడు, నిర్మాతతో మరో మూవీ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అజిత్.. తన 61వ చిత్రాన్ని వినోద్, బోనీ కపూర్‌లతో చెయ్యనున్నారు..

Thala Ajith Kumar : ముచ్చటగా మూడోసారి.. ‘వలిమై’ విడుదలకు ముందే ‘తల’ 61 ప్రారంభం..!

Thala Ajith Kumar

Updated On : April 29, 2021 / 1:41 PM IST

Thala Ajith Kumar: కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ ‘నేర్కొండ పార్వై’ (పింక్ రీమేక్) తర్వాత వెంటనే నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు హెచ్. వినోద్‌లతో కలిసి ‘వలిమై’ సినిమా చేస్తున్నారు.. అజిత్ నటిస్తున్న 60వ సినిమా ఇది.. త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది.. ఈ మూవీలో టాలీవుడ్ హీరో ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు..

Thala Ajith

‘వలిమై’ విడుదల కాకముందే మళ్లీ అదే దర్శకుడు, నిర్మాతతో మరో మూవీ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అజిత్.. తన 61వ చిత్రాన్ని వినోద్, బోనీ కపూర్‌లతో చెయ్యనున్నారు.. ఈ ముగ్గురి కలయికలో తెరకెక్కబోయే మూడో చిత్రమిది.. ఇంతకుముందు దర్శకుడు శివతో ‘వీరం, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి వరుస సినిమాలతో సూపర్ హిట్ కొట్టారు అజిత్.. ఇక ‘తల’ 61వ చిత్రానికి సంబంధించి ఇప్పటికే కథ – స్క్రీన్‌ప్లే పూర్తవడంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేసేశారు.

Thala Ajith

జూలైలో షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది వేసవికి విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.. ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రణాళికలో మార్పులు జరిగే అవకాశముంది.. మే 1న అజిత్ 50 పుట్టినరోజు సందర్భంగా ‘వలిమై’ ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు..

Thala Ajith