EWS Reservations Supreme Court : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు యు. లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు అయ్యాయి.

EWS reservations
EWS Reservations Supreme Court : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు యు. లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.
రిజర్వేషన్లు ఆర్థిక సమానత కోసం కాదు ప్రాతినిధ్యం కోసమేనని పిటిషనర్లు వాదన. ఆర్థిక వెనుకబాటుతనం రిజర్వేషన్ల కల్పనకు ఆధారం కాదనన్నారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని రాజ్యాంగ సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు.
EWS Quota: ఈడబ్ల్యూఎస్ కోటా రాజ్యాంగబద్ధమే.. సమర్ధించుకున్న కేంద్రం
సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో 50% రిజర్వేషన్లను మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని కేంద్ర ప్రభుత్వం వాదన. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.