Anurag Thakur: టీఎంసీ, ఆప్ పోటీపడుతున్నాయి: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా
ఎవరు ఎక్కువ అవినీతికి పాల్పడతారన్న విషయంపై పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీచర్ పోస్టుల భర్తీ కుంభకోణం బయటపడిందని అన్నారు. ఒకరి ఇంట్లో ఏకంగా 21 కోట్ల రూపాయలు బయటపడ్డాయంటే ఇది ఎంత పెద్ద కుంభకోణమో ఊహించుకోవచ్చని చెప్పారు.

Excise Policy Case: "Not the first case of corruption against AAP...", Union Minister Anurag Thakur
Anurag Thakur: ఎవరు ఎక్కువ అవినీతికి పాల్పడతారన్న విషయంపై పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. టీచర్ల పోస్టుల భర్తీ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్ధ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఇప్పటికే ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ జైలులో ఉన్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీలో అవకతవకలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఆయా అంశాలపై అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ… వీలైనంత దోచుకునే విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని ఆయన ఆరోపించారు.
అవినీతిని అంతం చేస్తామని అన్నవారే ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. అలాగే, అవినీతికి సంబంధించిన అన్ని రికార్డులను పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బద్దలుకొడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టీఎంసీ అంటే ది మౌంటెన్ ఆఫ్ కరప్షన్ (అవినీతి కొండ)గా మారిందని చెప్పారు. మమతా బెనర్జీ పాలనలో చిట్ ఫండ్, బొగ్గు కుంభకోణాలు జరిగాయని అన్నారు. ఇప్పుడు టీచర్ పోస్టుల భర్తీ కుంభకోణం బయటపడిందని చెప్పారు. ఒకరి ఇంట్లో ఏకంగా 21 కోట్ల రూపాయలు బయటపడ్డాయంటే ఇది ఎంత పెద్ద కుంభకోణమో ఊహించుకోవచ్చని చెప్పారు.
COVID19: దేశంలో 1,52,200కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య