COVID19: దేశంలో 1,52,200కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య‌ 

దేశంలో కొత్త‌గా 20,279 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య‌ 1,52,200గా ఉంద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం రిక‌వ‌రీ రేటు 98.45 శాతంగా ఉంద‌ని పేర్కొంది. గ‌త 24 గంటల్లో 18,143 మంది క‌రోనా నుంచి కోలుకున్నారని తెలిపింది.

COVID19: దేశంలో 1,52,200కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య‌ 

COVID-19

COVID19: దేశంలో కొత్త‌గా 20,279 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య‌ 1,52,200గా ఉంద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం రిక‌వ‌రీ రేటు 98.45 శాతంగా ఉంద‌ని పేర్కొంది. గ‌త 24 గంటల్లో 18,143 మంది క‌రోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,32,10,522కు చేరిందని వివ‌రించింది. క‌రోనాతో నిన్న 36 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,26,033కి చేరింద‌ని చెప్పింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 5.29 శాతానికి చేరిందని పేర్కొంది. వారాంత‌పు పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉందని చెప్పింది. నిన్న 3,83,657 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు చేసిన క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య 87.25 కోట్ల‌కు చేరింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 201.99 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసుల‌ను వాడారు. వాటిలో 92.94 కోట్ల సెకండ్ డోసులు, 7.18 కోట్ల బూస్ట‌ర్ డోసులు ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో 28,83,489 డోసులు వేశారు.

PV Sindhu: లాల్‌ద‌ర్వాజా అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించిన పీవీ సింధు