Muharram at Belagavi: ఒక్క ముస్లిమూ లేరు.. అయినా ఏళ్లుగా అక్కడ ఘనంగా మొహర్రం
క్కడ మరో విశేషం ఏంటంటే.. ఫకిరేశ్వర్ స్వామిజీ మసీదులో హిందూ పూజారి తప్పనిసరిగా పూజ చేస్తారట. ఇక చుట్టు పక్కల గ్రామాల నుంచి మౌల్వీలు ఇక్కడికి వచ్చి పండగ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని గ్రామస్థులు అంటున్నారు. ఈ పండగలో కర్బల్ డాన్స్, యూనిక్ రోప్ ఆర్ట్, మంటలను దాటడం లాంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయట. పండగ ప్రారంభమైన మొదటి చివరి రోజుల్లో ఇవి నిర్వహిస్తారని స్థానికులు తెలిపారు.

There is no muslim but the villagers celebrate Muharram every year
Muharram at Belagavi: పీర్ల పండగ గురించి తెలుగు ప్రజలకు కొత్తగా చెప్పనక్కర్లేదు. మొహర్రంగా ప్రసిద్ధి గాంచిన ఈ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఆంధ్రాలో అయితే ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో జరిగే ఈ పండుగ తెలంగాణలో ముస్లింలు లేని గ్రామాల్లో కూడా జరుగుతుంటుంది. నైజాం పాలన ప్రభావం ఒక కారణం కాగా, తెలంగాణలో హిందూ-ముస్లింల మధ్య పెరిగిన స్నేహానికి ప్రతీకగా కూడా ఈ పండగ ఏటా ఘనంగా జరుగుతుంది. అయితే తెలంగాణ ఆవల ఇలాంటి వాతావరణం కనిపించదు. అలాంటిది కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో ఒక్క ముస్లిం లేకపోయినా ఏళ్లుగా మొహర్రం పండుగ నిర్వహిస్తుండడం విశేషం.
బెళగావి జిల్లాలోని సౌందత్తి తాలూకాలో ఉన్న హిరేబిదానూర్ అనే గ్రామంలో ప్రతి ఏటా ఐదు రోజుల పాటు ఈ పండగ ఘనంగా నిర్వహిస్తారు. రంజాన్ తర్వాత అత్యంత పవిత్ర పండుగగా ముస్లింలు భావించే ఈ పండగను అక్కడ కొన్నేళ్లుగా జరుగుతోంది. ఆ గ్రామంలో మొహర్రం పండుగను వాల్మీకి, కురుబ మెజారిటీగా జరుపుకుంటారట. కారణం ఆ గ్రామంలో వారే పెద్ద సంఖ్యలో ఉండడం. పైగా అక్కడ ‘ఫకిరేశ్వర్ స్వామిజీ’ అనే పేరుతో ఒక మసీదు నిర్మించి, అక్కడే ఈ పండుగను నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
మరో విశేషం ఏంటంటే.. ఫకిరేశ్వర్ స్వామిజీ మసీదులో హిందూ పూజారి తప్పనిసరిగా పూజ చేస్తారట. చుట్టు పక్కల గ్రామాల నుంచి మౌల్వీలు ఇక్కడికి వచ్చి పండగ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని గ్రామస్థులు అంటున్నారు. ఈ పండగలో కర్బల్ డాన్స్, యూనిక్ రోప్ ఆర్ట్, మంటలను దాటడం లాంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయట. పండగ ప్రారంభమైన మొదటి చివరి రోజుల్లో ఇవి నిర్వహిస్తారని స్థానికులు తెలిపారు.
Kapil Sibal on SC: న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్న సిబల్.. న్యాయవాదుల విమర్శలు