లుక్స్ అదుర్స్.. నెట్‌లో వైరల్‌గా మారిన Modified Wild Maruti Omnis

Three wild, modified Maruti Omnis: మారుతి ఓమ్ని(maruti omni). వాహనదారులకు పరిచయం అక్కర్లేని పేరు. భారత్ లో విపరీతంగా సేల్ అయిన పాపులర్ వ్యాన్. దాదాపు 30 ఏళ్ల పాటు మారుతి ఓమ్ని హవా నడిచింది. మూడు దశాబ్దాల పాటు వీటి ఉత్పత్తి కొనసాగింది. మన దేశ రోడ్లపై తరుచుగా కనిపించిన వ్యాన్ ఇది. దీన్ని వ్యక్తిగతంగాను కమర్షియల్ గానూ ఉపయోగించారు. మారుతి సంస్థ ఓమ్నిలో కార్గో వెర్షన్ కూడా విడుదల చేసింది. కాగా భద్రత, కాలుష్య ఉద్గార నిబంధనల కారణాలతో మారుతీ సుజుకి యాజమాన్యం మారుతి ఓమ్ని ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చింది.
మారుతి ఓమ్నిల ఉత్పత్తిని నిలిచినా.. మన దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఈ వాహనాలు కనిపిస్తున్నాయి. రోడ్లపై సందడి చేస్తున్నాయి. కాగా, కొందరు వ్యక్తులు తమ దగ్గరున్న మారుతి ఓమ్నిల రూపురేఖలు మార్చేశారు. అలా మాడిఫై చేసిన మూడు మారుతి ఓమ్నిలు ఇప్పుడు అందరి దృష్టి ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
Off-road Omni (Gymni):
ఓమ్ని వ్యాన్స్ లో తొలుత మాడిఫై చేసిన వ్యాన్ ఇదే. ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యింది. పాపులారిటీని సంపాదించింది. ఇండి గ్యారేజ్, హోలీ షిఫ్ట్ లు మాడిఫికేషన్స్ చేశాయి. దీనికి జిమ్నిగా(Gymni) నామకరణం చేశారు. ఎందుకంటే జిప్సీ(Gypsy) భాగాలతో ఈ ఓమ్నీని మాడిఫై చేశారు. ఓమీ బాడీని పూర్తిగా రిపేర్ చేశారు. చిన్న టైర్లు తొలగించి పెద్ద టైర్లు తగిలించారు. మారుతి ఓమ్ని ఒరిజినల్ లుక్ నే పూర్తిగా మార్చేశారు.
Pic Credit: Holy Shift
ఫ్రంట్ సైడ్ లో బంపర్ మీద ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఆక్సిలరీ ల్యాంప్స్, స్కిడ్ ప్లేట్ బిగించారు. పెద్ద టైర్లు, రిమ్స్ కారణంగా సాధారణ ఓమ్ని కన్నా ఈ జిమ్ని పెద్దగా కనిపిస్తుంది. జిప్పీలో వాడే ఇంజిన్ ని దీనికి బిగించారు. టాప్ లో లగేజ్ ర్యాక్ అమర్చారు. కిటికీలను మెటల్ షీట్స్ తో పూర్తిగా సీల్ చేశారు. మొత్తంగా మాడిఫైడ్ ఓమ్నీ+జిప్సీ కాంబినేషన్ చాలా క్రేజీగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Pic Credit: Holy Shift
Gangster Omni:
Off-road Omni (Gymni) తర్వాత అంతగా పాపులర్ అయిన మోడల్ గ్యాంగ్ స్టర్ ఓమ్ని. కార్బన్ ఆటోమోటివ్ దీన్ని రూపొందించింది. ఓమ్నీ లోపల, బయట మాడిఫై చేశారు. వాహనాన్ని పూర్తిగా బ్లాక్ కలర్ తో పెయింట్ చేశారు. బంపర్ పై ఎల్ఈడీ ఇండికేటర్స్ బిగించారు. స్లైడింగ్ డోర్స్ ని స్వల్పంగా మార్పులు చేశారు. ఈ మాడిఫైడ్ ఓమ్నీ అచ్చంగా గ్యాంగ్ స్టర్ మూవీలోని కారుని తలపిస్తుంది.
Lowrider Omni:
పాపులర్ అయిన మాడిఫైడ్ ఓమ్నీస్ లో మూడోది Lowrider Omni. కేరళలో దీన్ని రూపొందించారు. ఈ కారు నిఖిల్ కుమార్ అనే వ్యక్తిది. ఫ్రంట్ బంపర్ నేలకు ఆనుకుని ఉన్నట్టుగా ఉంది. హెడ్ ల్యాంప్స్ ను కస్టమైజ్ చేశారు. ఇందులో విభిన్నమైన అంశం డోర్. స్లైడింగ్ డోర్ ని కాస్త గుల్లింగ్ డోర్ గా మార్చేశారు. లోపల కేబిన్ మొత్తం బ్లాక్ కలర్ థీమ్ తో కనిపిస్తుంది.