5 లక్షల డౌన్‌లోడ్లతో TikTok ను దాటేసిన Chinagari యాప్

  • Published By: srihari ,Published On : June 22, 2020 / 02:17 PM IST
5 లక్షల డౌన్‌లోడ్లతో TikTok ను దాటేసిన Chinagari యాప్

Updated On : June 22, 2020 / 2:17 PM IST

భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో డ్రాగన్ కు వ్యతిరేకంగా భారతదేశంలో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. యాంటీ చైనా నినాదంతో ఆ దేశపు ఉత్పత్తులను బైకాట్ చేయాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో డ్రాగన్ కంట్రీ షార్ట్ వీడియో షేరింగ్ TikTok యాప్‌కు పోటీగా భారతీయ యాప్ Chinagari అత్యధిక డౌన్ లోడ్లతో దూసుకెళ్తోంది.

కేవలం 72 గంటల్లోనే 5 లక్షల డౌన్‌లోడ్‌లను నమోదు చేసింది. దేశీయ యూజర్లు చైనీస్ సామాజిక యాప్‌లను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా యాప్ ప్రస్తుతం భారతీయ యూజర్లలో ప్రజాదరణను పొందినట్టు నగర ఆధారిత డెవలపర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 

జూన్ 15న తూర్పు లడఖ్ గాల్వన్లో చైనా దళాలతో హింసాత్మక ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారతీయ సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. చైనా ఉత్పత్తులను బహిష్కరించడంతో పాటు మొబైల్ యాప్స్ తొలగించాలంటూ దేశంలో డిమాండ్ పెరుగుతోందని అతి తక్కువ సమయంలోనే భారీగా యూజర్లు Chinagari కుటుంబంలో జాయిన్ అయ్యారని అప్లికేషన్ డెవలపర్లు బిస్వాత్మా నాయక్, సిద్ధార్థ్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. Chinagari డిమాండ్ పెరగడంతో గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. టిక్‌టాక్ క్లోన్ ప్లాట్‌ఫామ్ అయిన మిట్రాన్ యాప్‌కు ఇప్పటికే జనాదరణను అధిగమించిందని పేర్కొంది. 

కస్టమ్ రూపొందించిన ఆడియో, వీడియో ఆధారిత ఉచిత సామాజిక ప్లాట్‌ఫారమ్‌ను 2019లో వీరిద్దరూ అభివృద్ధి చేశారు. ఇప్పుడు వారు తక్కువ వ్యవధిలో మిలియన్ డౌన్‌లోడ్‌ల మైలురాయిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. Chinagari యాప్ కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసిందని, చాలా మంది పెట్టుబడిదారులు మా యాప్ పై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

Chinagari యాప్ అన్ని భాషలలో లభిస్తోంది. వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి, స్నేహితులతో చాట్ చేయడానికి, కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి, కంటెంట్‌ను భాగస్వామ్యం చేయడానికి, ఫీడ్‌ల ద్వారా బ్రౌజ్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. 

Chinagari యూజర్లకు వాట్సాప్ స్టేటస్, వీడియోలు, ఆడియో క్లిప్‌లు, GIF స్టిక్కర్లు, ఫొటోలతో క్రియేటివీ పొందే అవకాశం లభిస్తుందన్నారు. కంటెంట్ క్రియేటివ్ వీడియో ఎంత వైరల్ అవుతుందో దాని ఆధారంగా Chinagari తన యూజర్లకు చెల్లిస్తుంది. యాప్‌లో వినియోగదారు అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో కోసం, కంటెంట్ క్రియేటర్‌కు ఒక్కో వ్యూకు పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్లను నగదు కోసం రీడీమ్ చేసుకోవచ్చు.