ఈ టిప్స్ ఫాలో అవ్వండి : వాట్సాప్‌లో బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టాలంటే?

  • Published By: srihari ,Published On : May 6, 2020 / 08:42 AM IST
ఈ టిప్స్ ఫాలో అవ్వండి : వాట్సాప్‌లో బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టాలంటే?

Updated On : May 6, 2020 / 8:42 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో బ్యాంకింగ్ మోసాల విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్ లో షేర్ అయ్యే ఫేక్ న్యూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు సైబర్ నిపుణులు. ఇటీవల సోషల్ ప్లాట్ ఫాంలపై బ్యాంకింగ్ మోసాల ఘటనలు జరుగుతున్నాయి. ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్‌ ప్రతిఒక్కరికి ఒక కమ్యూనికేషన్ సెంటర్‌గా మారింది.

ఇందులో యూజర్లతో పాటు స్కామర్లు కూడా భారీగా వినియోగిస్తూనే ఉన్నారు. వాట్సాప్‌లో ఆన్ లైన్ మోసాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే సైబర్ నిపుణులు బ్యాంకు కస్టమర్లు, వాట్సాప్ యూజర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వాట్సాప్ లో బ్యాంకింగ్ స్కామ్స్ జరగకుండా ఉండేందుకు యూజర్లు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం.. 

* ఆన్‌లైన్‌‌కు సంబంధించి సాధారణ అవగాహన తప్పక ఉండాలి. అందులో నెట్ బ్యాంకింగ్ యూజర్లు తమ యూజర్ నేమ్, PIN, బ్యాంకింగ్ పాస్ వర్డ్ లను ఎట్టపరిస్థితిల్లోనూ ఎవరికి షేర్ చేయకూడదు. 
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) ఎవరికి షేర్ చేయరాదు. మీరు పంపే నగదు ఎంత చిన్న అమౌంట్ అయిన సరే. 
బ్యాంకు నిబంధన ప్రకారం.. మీ OTP మీరు చూడకుండా ఎంటర్ చేయరాదు. 
* గుర్తు తెలియని ఫోన్ నెంబర్లకు నమ్మొద్దు. తెలిసిన కాంటాక్ట్ నెంబర్లతో మాత్రమే పరిమితం చేయాలి. గుర్తు తెలియని వారు, వెబ్ సైట్ల నుంచి ఎలాంటి ఫైల్స్ డౌన్ లోడ్ చేయరాదు. అన్ని నెంబర్లు ఒకేలా కలిసి ఉన్న నెంబర్లు ఉంటే వాటికి దూరంగా ఉంటేనే మంచిది. 
* మీ ఫోన్లలోని వాట్సాప్ డేటా డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోని ఉంచుకోండి. ఒకవేళ మీరు మీ ఫోన్ కోల్పోయినా లేదా దొంగిలించినా ఎవరికైనా అమ్మినా డేటాకు ఎలాంటి ముప్పు ఉండదు. ఎవరికైనా మీ ఫోన్ ఇస్తే.. బ్యాంకింగ్ వివరాలన్ని డిలీట్ చేసేయండి. 
* పబ్లిక్ వైఫై నెట్ వర్క్ లతో వాట్సాప్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు. మీ మొబైల్ డేటాను వాట్సాప్ వాడొచ్చు. మీ ఫోన్ డేటా ఎంతో సురక్షితమైనది. 

స్కామర్లు, సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అమాయకులకు మాయమాటలు చెప్పి వారి నుంచి భారీమొత్తంలో నగదు కాజేస్తున్నారు. చాలామందికి ఆన్ లైన్ బ్యాంకింగ్ లపై అవగాహన లేక ఇలా సైబర్ నేరగాళ్లు ఉచ్చులో చిక్కుకుంటున్నారు.

వాట్సాప్ ద్వారా మీరు ఎవరికి ఎలాంటి వ్యక్తిగత వివరాలను షేర్ చేయరాదని మరవొద్దు. లేదంటే.. మోసగాళ్లు మీ విలువైన డేటా చిక్కినట్టే.. వ్యక్తిగత వివరాలతో పాటు మీ బ్యాంకింగ్ వివరాలు చిక్కితే.. అంతే సంగతలు మీ అకౌంట్లో డబ్బులు ఇట్టే మాయం చేసేస్తారు మోసగాళ్లు.. తస్మాత్ జాగ్రత్త.

Also Read | వాట్సప్‌లో ఫేక్ న్యూస్ మనమే కనిపెట్టేయొచ్చు