కొత్త సినిమాలకు కొబ్బరికాయ కొట్టారు..

కొత్త సినిమాలకు కొబ్బరికాయ కొట్టారు..

Updated On : January 8, 2021 / 5:22 PM IST

Tollywood New Movies: సినిమా వాళ్లకు కొబ్బరికాయ నుండి గుమ్మడికాయ కొట్టేవరకు ముహూర్తాలనేవి చాలా ఇంపార్టెంట్.. ఓపెనింగ్, ఆడియో లేదా ట్రైలర్ రిలీజ్ అలాగే సినిమా విడుదల వరకు ప్రతీ సందర్భంగా ప్రత్యేకంగా మంచి ముహూర్తాలు చూసుకుంటుంటారు. నేడు శుక్రవారం (జనవరి 8) మంచి రోజు కావడంతో పలు తెలుగు సినిమాలు పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి.. అవేంటో ఓసారి చూద్దాం..

యు.జి ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా గోపీనాద్ రెడ్డి దర్శకత్వంలో కె. ప్రవీణ నిర్మిస్తున్న ‘సమ్మతమే’ చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.

Kiran Abbavaram

అనసూయ భరద్వాజ్, నిహారిక కొణిదెల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. రాయుడు చిత్రాలు బ్యానర్ మీద భాను రాయుడు దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిహారిక భర్త చైతన్య, స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కూడా పాల్గొన్నారు.

Niharika Konidela

వైవిధ్య భరితమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాలెంటెడ్ యాక్టర్ శ్రీవిష్ణు హీరోగా లక్కీ మీడియా నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో నారా రోహిత్ క్లాప్ నిచ్చారు.

Sree Vishnu

తమిళస్టార్ ధనుష్, మాళవికా మోహనన్ జంటగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా ఈరోజు ప్రారంభమైంది. ధనుష్ హీరోగా నటిస్తున్న 43వ సినిమా ఇది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు.

 D 43