టాలీవుడ్‌ని ‘ఆట’ ఆడేసుకుంటున్నారు..

టాలీవుడ్‌ని ‘ఆట’ ఆడేసుకుంటున్నారు..

Updated On : January 28, 2021 / 9:14 PM IST

Sports Backdrop Movies: టాలీవుడ్‌ని ఆడేసుకుంటున్నారు హీరోలు.. ఎవరికి నచ్చిన స్పోర్ట్‌ని వాళ్లు సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ మీద తమ సూపర్ గేమ్‌ని చూపించడానికి రెడీ అవుతున్నారు స్టార్లు. అసలు తెలుగు తెరమీద ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చెయ్యని స్పోర్ట్స్‌ని తమ దైన స్టైల్లో తెరకెక్కిస్తున్నారు. మరి టాలీవుడ్ స్క్రీన్ మీద ఆటాడుకోవడానికి రెడీ అవుతున్న ఆ హీరోలెవరో చూద్దాం.

రొటీన్ కమర్షియల్ సినిమాలకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే థియేటర్ల దాకా వెళుతున్నారు ఫ్యాన్స్, ఆడియెన్స్.. అందుకే హీరోలు కూడా తమ ఇమేజ్‌ చట్రంలోనుంచి బయటకొచ్చి.. కొత్త కొత్త జానర్స్ వైపు వెళుతున్నారు.

ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇలాగే ట్రాక్ చేంజ్ చేశారు . బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌లో ఉన్న ఈ రౌడీ హీరో.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీతో వస్తున్నారు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ బ్రాక్ డాప్‌లో తెరకెక్కుతున్న ‘లైగర్’ కోసం థాయ్‌లాండ్‌లో 15 మంది డిఫరెంట్ ట్రైనర్స్‌తో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు విజయ్.

Liger
పల్లెటూరి నుంచి ప్రో కబడ్డీ లీగ్ వరకూ వచ్చి సూపర్ క్రేజ్ సంపాదించిన ఆట కబడ్డీ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రిలేట్ అయ్యే ఈ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో గోపీచంద్ ‘సీటీ మార్’ సినిమా చేస్తున్నారు. సంపత్ నంది డైరెక్షన్లో గోపీచంద్ , తమన్నా, కబడ్డీ కోచ్‌లుగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లో కూతకు రెడీ అవుతోంది.

Seetimaarr

మెగా హీరో వరుణ్ తేజ్ కూడా బాక్సర్‌గా తన రూట్ మార్చారు. స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్న వరుణ్.. ఈసారి కూడా ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ సినిమాతో వస్తున్నారు. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ‘గని’ మూవీకి సంబంధించి బాక్సింగ్ ట్రైనింగ్ ఇంగ్లండ్ బాక్సర్ డేవిడ్ టోనీ జెఫ్రిస్ దగ్గర తీస్కుంటున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఫుల్‌గా ప్రాక్టీస్ చేస్తూ.. ట్రయిన్ అయ్యి బాక్సర్‌గా ప్రేక్షకులముందుకొస్తున్నారు వరుణ్.

Ghani

యంగ్ హీరో నాగశౌర్య కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. డిఫరెండ్ డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేస్తున్న శౌర్య.. తెలుగులోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే ఇప్పటి వరకూ టచ్ చెయ్యని ఆర్చరీని తెరమీదకి తీసుకొస్తున్నారు. ఆర్చరీ నేపథ్యంలో వస్తున్న ఈ ‘లక్ష్య’ సినిమా కోసం శౌర్య.. సిక్స్ ప్యాక్ బాడీతో.. ఫుల్ ఫిజిక్‌ని మెయింటెన్ చేస్తున్నారు. Lakshya

ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో హాకీ బ్యాక్ డ్రాప్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా బెస్ట్ మూవీ అంటే ‘చక్ దే ఇండియా’ అనే అంటారు అందరూ. అలాంటి నేషనల్ స్పోర్ట్‌ని తెలుగు ఆడియన్స్‌కి పరిచయం చేస్తున్నారు సందీప్ కిషన్.

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా ఫస్ట్ టైమ్ టాలీవుడ్ స్క్రీన్ మీద హాకీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘ఎ 1 ఎక్స్‌ప్రెస్’.. స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్‌లో కరప్షన్ బ్యాక్ డ్రాప్‌లో జీవన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ హాకీ ప్లేయర్‌గా తన సత్తా చూపించబోతున్నారు.

A 1 Express

వెంకటేష్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ రాబోతోంది. హార్స్ రేసింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా మీద ఫుల్ హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఆది పినిశెట్టి అథ్లెట్‌గా తెరకెక్కుతున్న మరో సినిమా ‘క్లాప్’. 400 మీటర్ల స్ప్రింట్ రన్నర్‌గా ఈ సినిమాలో ఆది కనిపించబోతున్నారు. దీనికి సంబంధించి టఫ్ ట్రైనింగ్ తీసుకుని ‘క్లాప్’ తో త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.