coronavirus vaccine సిద్ధం చేసిన సిగరెట్ కంపెనీ.. human trials ఒక్కటే లేట్

  • Published By: Subhan ,Published On : May 16, 2020 / 05:47 AM IST
coronavirus vaccine సిద్ధం చేసిన సిగరెట్ కంపెనీ.. human trials ఒక్కటే లేట్

Updated On : October 31, 2020 / 2:48 PM IST

ప్రపంచంలోనే టాప్ పొగాకు కంపెనీ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సిద్ధం చేశానంటోంది. ఇక మనుషులపై ప్రయోగించడమే తరువాయనే విశ్వాసం వ్యక్తం చేస్తుంది. లండన్ లోని అమెరికన్ పొగాకు కంపెనీ శుక్రవారం ప్రయోగాత్మకమైన వ్యాక్సిన్ సిద్ధం చేసినట్లు.. లాబొరేటరీ టెస్టు పూర్తి చేసుకుందని.. ఇక మనుషులపై ప్రయోగించడమే లేట్ అని చెప్పింది. 

సిగరెట్ లు తయారుచేయడంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రిటిష్ అమెరికన్ టుబాకో కంపెనీ వ్యాక్సిన్ కనుగొనడానికి త్వరపడుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిగరెట్ స్మోకింగ్ చేసే వారిలో కరోనాను ఎదుర్కొనే శక్తి తక్కువ ఉంటుంది. ఇలాంటి వారిలో కరోనా మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. 

శుక్రవారం.. ల్యాబొరేటరీ టెస్టులు పూర్తి చేసుకుని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో దీనిని హ్యూమన్ ట్రయల్స్ లో వాడనున్నారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ కు నిధులను కేటాయించాం. జూన్ నెలాఖరు నాటికి దీనిని మానవ శరీరాలపై ప్రయోగిస్తామని బ్రిటిష్ అమెరికన్ టుబాకో కంపెనీ చెప్పుకొచ్చింది. 

ఈ ప్రయోగంలో కీలకంగా యాంటీ జెన్ అనే ఫ్రాగ్మెంట్ ను వాడారు. పొగాకు మొక్కల పునరుత్పత్తి కోసం దీనిని వాడుతుంటారు. మొక్కలు పెరిగిన తర్వాత ఈ యాంటి జెన్ స్వచ్ఛంగా మారిపోతుంది. ఈ యాంటీజెన్ మనుషుల శరీరాల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెప్పింది. 

లేటెస్ట్ అప్‌డేట్‌లో పొటెన్షియల్ వ్యాక్సిన్ పాజిటివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్తుంది.. ప్రీ క్లీనికల్ టెస్టింగ్ లో ఇది నిర్ధారించాం. ఇప్పుడు తర్వాతి స్టేజి కోసం ఎదురుచూస్తున్నాం. ఒకసారి అనుమతులు దొరికితే మానవ శరీరాలపై ప్రయోగిస్తాం. ఇప్పటికీ ల్యాబొరేటరీల్లో టెస్టులు పూర్తి చేసుకున్న 110 పొటెన్షియల్ వ్యాక్సిన్లు మానవ శరీరాలపై ప్రయోగాల కోసం ఎదురుచూస్తున్నాయి. 

నొవల్ కరోనా వైరస్ పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేకపోతున్నారని.. సైంటిస్టులు పలు కీలక దశలను విస్మరిస్తున్నారని అధికారులు అంటున్నారు. ఏదేమైనా ఓ రెండు సంవత్సరాల్లో వ్యాక్సిన్ కు మందు తయారవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

Read Here>> ఇండియాకు వెంటిలేటర్లు డొనేట్ చేస్తాం: ట్రంప్