Tripura Govt: 10th & 12th పరీక్షలు రద్దు చేసిన త్రిపుర!
కరోనా మహమ్మారి దెబ్బకు పరీక్షలు రద్దు చేసిన జాబితాలో మరో రాష్ట్రం చేరింది. తాజాగా త్రిపుర ప్రభుత్వం రాష్ట్రంలో 10th, 12th పరీక్షలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ ఏడాది విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లేనని ప్రభుత్వం ప్రకటించింది.

Tripura Govt
Tripura Govt: కరోనా మహమ్మారి దెబ్బకు పరీక్షలు రద్దు చేసిన జాబితాలో మరో రాష్ట్రం చేరింది. తాజాగా త్రిపుర ప్రభుత్వం రాష్ట్రంలో 10th, 12th పరీక్షలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ ఏడాది విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లేనని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే.. పరీక్షా ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు.. పరీక్షలు రాసి ఉంటే మంచి మార్కులు పొందేవారమని భావించే విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం కల్పించనుంది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత వీరి కోసం పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ ప్రకటించారు.
దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర విద్యాసంస్థలలో కూడా ప్రభుత్వం పరీక్షలు రద్దు చేయగా తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి. కాగా.. ఇప్పుడు రద్దు చేసిన జాబితాతో త్రిపుర కూడా చేరింది.