bjp: టీఆర్ఎస్‌తో మాకు పోటీ ఏంటీ?: బండి సంజయ్
టీఆర్ఎస్ పార్టీ తమకు పోటీయే కాదని బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్‌కు ఇక వీఆర్ఎస్ తప్పదని అన్నారు. బీజేపీతో టీఆర్ఎస్‌కు పోటీ ఎంటీ అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ తమకు గోటితో సమానమని చెప్పుకొచ్చారు.

Bandi Sunjay
bjp: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఆ పార్టీ తమకు పోటీయే కాదని చెప్పారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌కు ఇక వీఆర్ఎస్ తప్పదని అన్నారు. టీఆర్ఎస్‌తో బీజేపీతో పోటీ ఎంటీ అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ తమకు గోటితో సమానమని చెప్పుకొచ్చారు. బీజేపీ దేశంలోనే అతి పెద్ద పార్టీ అని, ప్రపంచంలో అత్యధికంగా కార్యకర్తలు ఉన్న పార్టీ అని ఆయన చెప్పారు.
India vs England: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఓపెనర్లుగా క్రీజులోకి శుభ్‌మన్, పుజారా
టీఆర్ఎస్ కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు చాలామంది ప్రముఖులు వస్తుంటే కనీస ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలను కేసీఆర్ గల్లి స్థాయికి దిగ జార్చారని ఆయన అన్నారు. బీజేపీ ఫ్లెక్సీ లను అడ్డుకొగలరేమోగానీ తమను అడ్డుకోలేరని ఆయన చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి.