Mumbai JJ Hospital : ముంబై జేజే ఆసుపత్రిలో బయటపడ్డ 132 ఏళ్ల నాటి భూగృహం
ముంబయిలోని జేజే ఆసుపత్రిలో పురాతనమైన ఓ భూగృహం బయటపడింది. ఆస్పత్రిలో ఏర్పడిన లీకేజీని పరిశీలిస్తుండా ఇది బయటపడింది. రాతి గోడలు, ఇటుకల వరసలతో ఇది నిర్మించబడి ఉన్న ఈ అండర్ గ్రౌండ్ భూగృహం 12 మీటర్ల పొడవు, 1.4 మీటర్ల ఎత్తు ఉంది. ఇది 132 ఏళ్ల నాటి భూగృహం అని భావిస్తున్నారు.

Underground chamber found at JJ Hospital Mumbai
Mumbai JJ Hospital : ముంబయిలోని జేజే ఆసుపత్రిలో పురాతనమైన ఓ భూగృహం బయటపడింది. ఆస్పత్రిలో ఏర్పడిన లీకేజీని పరిశీలిస్తుండా ఇది బయటపడింది. రాతి గోడలు, ఇటుకల వరసలతో ఇది నిర్మించబడి ఉన్న ఈ అండర్ గ్రౌండ్ భూగృహం 12 మీటర్ల పొడవు, 1.4 మీటర్ల ఎత్తు ఉంది. ఇది 132 ఏళ్ల నాటి భూగృహం అని భావిస్తున్నారు.
ఈ ప్రాచీన నిర్మాణం సరిగ్గా జేజే ఆసుపత్రిలోని నర్సింగ్ కాలేజి కింది భాగంలో కనుగొనబడింది. ఈ భూగృహాన్ని జేజే ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్ అరుణ్ రాథోడ్ కనుగొన్నారు. ఓ లీకేజీని పరిశీలిస్తుండగా, ఈ భూగృహం ఆయన కంటబడింది. దాన్ని చూసిన వెంటనే ఆయనకు ఆసక్తికలిగింది. ఇదేదో పురాతన ఆనవాళ్లు ఉన్నట్లుగా ఉందే అని భావించిన ఆయన ఈ రహస్యాన్ని ఛేదించారు. అదో పురాతన కట్టడం అని గుర్తించారు.
ఈ అరుదైన ఘటనపై జేజే ఆసుపత్రి డీన్ డాక్టర్ పల్లవి సప్లే మాట్లాడుతూ.. ఈ భూగృహం ఎందుకు కట్టారో, ఎవరు కట్టారో తెలియడంలేదని?.దీని గురించి తాము జిల్లా కలెక్టర్ కు, పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చామని తెలిపారు. కొందరు ఇది బాంబు షెల్టర్ అయ్యుంటుందని చెబుతున్నారని వివరించారు. ఈ భూగృహం గురించి తెలియటంతో ఆస్పత్రి సిబ్బంది.,రోగులు,వారి బంధువులతో పాటు స్థానికులు కూడా వచ్చి ఆసక్తిగా చూస్తున్నారు.