Unni Mukundan : సరోగసి అంత ఈజీ కాదు.. సమంత సెట్‌లో ఎవరికీ ఆ విషయం చెప్పలేదు..

ఇక సమంత గురించి మాట్లాడుతూ.. ''సమంత ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. పోరాట సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాలలో అద్భుతంగా చేసింది. సమంతతో కలిసి పని చేస్తున్నప్పుడు తను..............

Unni Mukundan : సరోగసి అంత ఈజీ కాదు.. సమంత సెట్‌లో ఎవరికీ ఆ విషయం చెప్పలేదు..

Unni Mukundan comments on Samantha Health Issue

Updated On : November 5, 2022 / 7:51 AM IST

Unni Mukundan :  సమంత మెయిన్ లీడ్ లో నటిస్తున్న యశోద సినిమా నవంబర్ 11న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మలయాళం హీరో ఉన్ని ముకుందన్ ఓ ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఉన్ని ముకుందన్ జనతా గ్యారేజ్, భాగమతి సినిమాలతో తెలుగులో అలరించారు. యశోద సినిమా సరోగసి అంశంపై తెరకెక్కుతుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఉన్ని ముకుందన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపాడు.

ఉన్ని ముకుందన్ సరోగసి గురించి మాట్లాడుతూ.. ”సరోగసి అని చెప్పడానికి చాలా ఈజీగా అంటుంది. దాన్ని అందరూ చాలా తేలికగా తీసుకుంటారు. కానీ సరోగసి ఒక భావోద్వేగ ప్రయాణం, అదొక అద్భుతం. మన పురాణాల్లో కూడా ఇలాంటి వాటి గురించి విన్నాం. చట్టప్రకారం ఇలా అద్దెగర్భాన్ని తీసుకున్నప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. ఈ సినిమాలో సరోగసి గురించి, బయట సమాజంలో జరిగే కొన్ని అంశాలు చూపించాం” అని తెలిపాడు.

Ajay Devgn : మరో సౌత్ సినిమాని నాశనం చేయడానికి రెడీ అయిన బాలీవుడ్.. ఖైదీ సినిమా రీమేక్ లో హీరోయిన్ ని పెడుతున్నారు..

ఇక సమంత గురించి మాట్లాడుతూ.. ”సమంత ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. పోరాట సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాలలో అద్భుతంగా చేసింది. సమంతతో కలిసి పని చేస్తున్నప్పుడు తను మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు తెలీదు. సెట్ లో కూడా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. సోషల్ మీడియాలో దీని గురించి తన పోస్ట్ చూసి చాలా బాధపడ్డాను. త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను” అని అన్నాడు.