Bipin Rawat: యూపీలోని సైనిక్‌ స్కూల్‌కు దివంగత జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరు

యూపీలోని సైనిక్‌ స్కూల్‌కు దివంగత జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరు పెట్టాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ నిర్ణయించారు.

Bipin Rawat: యూపీలోని సైనిక్‌ స్కూల్‌కు దివంగత జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరు

Up Sainik School Named General Bipin Rawat

Updated On : January 7, 2022 / 1:59 PM IST

UP Sainik school named General Bipin Rawat : 2021 డిసెంబర్ లో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దివంగత ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరును మెయిన్‌పురి జిల్లాలోని ఒక సైనిక్‌ స్కూల్‌కు పెట్టాలని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెలికాప్టర్‌ ప్రమాదంలో నీలగిరి కొండల్లో నేలకొరిగిన రావత్‌కు నివాళిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం కార్యాలయం గురువారం ఒక ట్వీట్‌చేసింది. 2019 ఏప్రిల్‌ 1న ఈ స్కూల్‌ను ప్రారంభించారు. కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో రావత్‌ దంపతులతో సహా 13 మంది అమరులైన విషయం తెలిసిందే.

Coonoor Helicopter: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం వాతావరణ తప్పిదమే: మొదటి నివేదిక

కాగా యూపీలో నాలుగు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి అమేథీలోను..మరొకటి లక్నో,మెయిన్ పురి,Ghorakhalలోను ఉన్నాయి. వీటిలో లక్నోలో ఉన్న సైనిక్ స్కూల్ లక్నోలోని స్కూల్ UP సైనిక్ స్కూల్స్ సొసైటీ ద్వారా నిర్వహించబడుతుండగా మిగతావి రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్స్ సొసైటీచే నిర్వహించబడుతున్నాయి.