US Gun Violence: అగ్రరాజ్యంలో ఆగని కాల్పుల మోత.. మరో ముగ్గురు బలి!

అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. శనివారం ఒమాహాలోని వెస్ట్‌రోడ్స్‌ మాల్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడగా.. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఓ మహిళ గాయపడింది. ఈ ఘటన మరువక ముందే ఆదివారం టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.

US Gun Violence: అగ్రరాజ్యంలో ఆగని కాల్పుల మోత.. మరో ముగ్గురు బలి!

Us Gun Violence

Updated On : April 19, 2021 / 11:42 AM IST

US Gun Violence: అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. శనివారం ఒమాహాలోని వెస్ట్‌రోడ్స్‌ మాల్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడగా.. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఓ మహిళ గాయపడింది. ఈ ఘటన మరువక ముందే ఆదివారం టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11.40 గంట‌ల సమయంలో ఓ షాపింగ్ మాల్‌ సమీపంలోని అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన జరిగింది.

కాల్పులు జ‌రిపింది స్టీఫెన్ నికోల‌స్ బ్రోడెరిక్‌గా అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించగా అత‌డు గ‌తంలో ట్రావిస్ కౌంటీ ష‌రీఫ్ ఆఫీసులో డిటెక్టివ్‌గా ప‌నిచేశాడ‌ని వెల్ల‌డించారు. అత‌నిపై చిన్నారుల‌ను లైంగికంగా హించాడ‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉండగా ఇప్పుడు ఇలా కాల్పులకు తెగబడ్డాడు. అయితే.. ఇది గృహ హింసకు సంబంధించినదని, ఈ ఘటన వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారు ముగ్గురూ పెద్ద వయసు వారేకాగా.. కాల్పులు జరిగిన ప్రదేశంలోని ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు కోరారు. అయితే.. కాల్పులు ఎందుకు జ‌రిపాడ‌నే విష‌యం తెలియాల్సి ఉంద‌ని చెప్పారు.