Vakeel Saab Release: ఏప్రిల్ నెలలో వస్తున్న పవన్ 7వ సినిమా.. ఇంకా ప్రత్యేకతలు ఇవే!

పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఏప్రిల్ నెలలో వస్తున్న 7వ సినిమా వకీల్ సాబ్. ఇప్పటి వరకు ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా అందులో మూడు భారీ సక్సెస్ దక్కించుకుంటే మూడు పరాజయాలను మూటగట్టుకున్నాయి.

Vakeel Saab Release: ఏప్రిల్ నెలలో వస్తున్న పవన్ 7వ సినిమా.. ఇంకా ప్రత్యేకతలు ఇవే!

Vakeel Saab

Updated On : April 8, 2021 / 5:42 PM IST

Vakeel Saab Release: సినిమాల నుండి రాజకీయాలు.. రాజకీయ పార్టీ.. ఎన్నికల అనంతరం ఏళ్ల విరామం తర్వాత వస్తున్న సినిమా వకీల్ సాబ్. సాధారణంగానే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక క్రేజ్. ఆ పేరులోనే ఒక పూనకం ఉంటుందని ఆయన అభిమానులు చెప్పే మాట. మరి అలాంటిది ఇన్నాళ్ల విరామం తర్వాత వచ్చే సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాలా. నిజానికి వకీల్ సాబ్ హీరో ఓరియంటెడ్ రోటీన్ కథ కాదు. కానీ పవన్ పేరుతో ఈ సినిమా మీద ఎక్కడలేని అంచనాలు పెరిగిపోయాయి. మరికొన్ని గంటలలోనే ఈ సినిమా విడుదల కానుండగా పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఏప్రిల్ నెలలో వస్తున్న 7వ సినిమా వకీల్ సాబ్.

ఇప్పటి వరకు ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా అందులో మూడు భారీ సక్సెస్ దక్కించుకుంటే మూడు పరాజయాలను మూటగట్టుకున్నాయి. ఇదే నెలలో బద్రి, ఖుషీ, జల్సా విడుదలై విజయాన్ని అందుకోగా జానీ, తీన్ మార్, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలు బోల్తా కొట్టాయి. ఇక ఇప్పుడు ఇదే నెలలో వకీల్ సాబ్ విడుదల కానుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో పవన్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. శృతితో పవన్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు విడుదల కాగా ఇందులో కూడా ఒకటి హిట్ మరొకటి ఫట్. వకీల్ సాబ్ మూడవ సినిమా.

శృతి హాసన్ తో పాటు వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ తో అనుబంధం ఉన్న మరో నటుడు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ తో ప్రకాష్ రాజ్ సుస్వాగతం, బద్రి, జల్సా, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలలో నటించగా తొలి సినిమా బద్రిలో పాత్ర పేరు నందా కాగా వకీల్ సాబ్ లో పాత్ర పేరు కూడా నందానే కావడం విశేషం. కాగా వకీల్ సాబ్ దర్శక, నిర్మాతలు, సంగీత దర్శకుడితో పవన్ కళ్యాణ్ కు ఇదే తొలిసినిమా. దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు థమన్ లకు పవన్ కు ఇదే తొలిసినిమా కాగా ఈ ముగ్గురు ఈ సినిమా మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. మరి మరికొన్ని గంటలలోనే వెండితెరమీదకి రానున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి!

Read: http://Vakeel Saab Release: టికెట్ ధరల పెంపుపై షాకిచ్చిన హైకోర్టు!