Varudu Kaavalenu : షూటింగ్స్ షురూ..

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ‘వరుడు కావలెను’.. ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాల షూటింగ్ పున: ప్రారంభం..

Varudu Kaavalenu : షూటింగ్స్ షురూ..

Varudu Kaavalenu

Updated On : June 24, 2021 / 1:24 PM IST

Varudu Kaavalenu: యువ కథానాయకుడు నాగ శౌర్య, రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రూపొందిస్తున్న సినిమా ‘వరుడు కావలెను’.. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లో పునః ప్రారంభమైంది. హీరో హీరోయిన్ల మీద

ఓ సిచ్యువేషనల్ సాంగ్‌ను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో పాటు మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణతో త్వరలోనే షూటింగ్ పూర్తవుతుంది. ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు, నటీ నటుల పర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలవడమే కాక.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అంటున్నారు మూవీ టీమ్.

Varudu Kaavalenu

 

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నాయికగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి రచయిత గానూ, దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ.

‘నరుడి బ్రతుకు నటన’ షూటింగ్ ఈరోజు పునః ప్రారంభం అయింది. కథానాయకుడు సిద్ధు పైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.