Venaktesh: వెంకీ మామ సేఫ్ గేమ్.. రెండు ఫ్లాపులు మిస్!
హీరోలు తమ సినిమాలతో అభిమానులను ఆకట్టుకునేందుకు మంచి కథలను ఎంచుకోవాలని చూస్తుంటారు.

Venkatesh Missed Disasters
Venaktesh: హీరోలు తమ సినిమాలతో అభిమానులను ఆకట్టుకునేందుకు మంచి కథలను ఎంచుకోవాలని చూస్తుంటారు. అయితే కొన్నిసార్లు వారు ఎంచుకునే కథలు బాగున్నా, ఆడియెన్స్‌కు అవి కనెక్ట్ కాకపోవడంతో వారు పరాజయాలను చవిచూస్తారు. ఇక స్టార్ హీరోల విషయంలో ఇవి చాలా కామన్. అయితే కొన్నిసార్లు అదృష్టం కలిసొచ్చి, తాము చేయాల్సిన ఫ్లాప్ మూవీలను వదులుకుని మంచి పని చేస్తుంటారు మన హీరోలు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ విషయంలో జరిగింది.
Venkatesh : బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న వెంకీమామ
ఆయన చేయాల్సిన రెండు సినిమాలు వేరే హీరోలు చేయడం, అవి కాస్త బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మిగలడంతో వెంకీ మామ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. తమ హీరో ఈ సినిమాలను వదులుకోవడం చాలా మంచిదయ్యిందని వారు అంటున్నారు. ఇంతకీ వెంకటేష్ వదులుకున్న ఆ రెండు సినిమాలు ఏమిటని మీరు ఆలోచిస్తున్నారా.. ఇటీవల రిలీజ్ అయిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘రాధేశ్యామ్’ చిత్రాలను వెంకటేష్ కాదనడంతో ఆ రెండు సినిమాలు కూడా వేరే హీరోల ఖాతాల్లో పడ్డాయి.
దర్శకుడు కిషోర్ తిరుమల తొలుత వెంకటేష్‌ను దృష్టిలో పెట్టుకుని ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా చేయాలని రెడీ అయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి వెంకటేష్ తప్పుకున్నాడు. దీంతో అదే కథను యంగ్ హీరో శర్వానంద్‌తో తెరకెక్కించాడు ఈ డైరెక్టర్. ఇటీవల మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది.
Radhe Shyam: సాలిడ్ రన్ ఖాయం.. రాధే శ్యామ్ రిజల్ట్ ఇదే!
ఇక భారీ పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘రాధేశ్యామ్’ కూడా మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథను తొలుత దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వెంకటేష్‌కు వినిపించాడట. కానీ ఆయన ఈ సినిమాకు నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కాగా అదే కథను కొద్దిగా మార్పులు చేసిన రాధాకృష్ణ కుమార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో రాధేశ్యామ్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా ఫ్లాప్ దిశగా వెళ్తుండటంతో వెంకటేష్ ఈ రెండు సినిమాలు వదిలేసి చాలా మంచి పని చేశాడని అభిమానులు అంటున్నారు. మొత్తానికి వెంకటేష్ అదృష్టం బాగుండటంతో రెండు డిజాస్టర్ సినిమాలు తన ఖాతాలో పడకుండా బయట పడ్డాడని చెప్పాలి.