Bride attends college exam : పెళ్లిబట్టలతో పరీక్షలు రాస్తున్న వధువులు.. నెటిజన్ల ప్రశంసలు

ఇటు జీవిత పరీక్ష.. అటు కెరియర్‌కి సంబంధించిన పరీక్ష. రెండు ఇంపార్టెంటే కదా.. అందుకే పెళ్లిరోజే పరీక్ష ఉండటంతో పెళ్లి దుస్తులతో పరీక్షా కేంద్రాలకు వస్తున్నారు వధువులు. ఇటీవల కాలంలో వైరల్ అయిన వీడియోలు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Bride attends college exam : పెళ్లిబట్టలతో పరీక్షలు రాస్తున్న వధువులు.. నెటిజన్ల ప్రశంసలు

Bride attends college exam

Updated On : May 18, 2023 / 2:54 PM IST

viral video : ఇటీవల కాలంలో పెళ్లి దుస్తులతో పరీక్షలకు హాజరవుతున్న వధువుల గురించి వింటున్నాం. పరీక్షల సమయంలో పెళ్లి ఎందుకు పెట్టుకున్నారు అని చాలామందికి డౌట్ వస్తుంది. భారత దేశంలో పెళ్లిళ్లు పూజారి నిర్ణయించిన ముహూర్తానికి జరుగుతుంటాయి. అలా తప్పనిసరి పరిస్థితుల్లో అటు జీవిత పరీక్ష.. ఇటు కెరియర్‌కి సంబంధించిన పరీక్షలు రాస్తున్నారు పెళ్లి కూతుళ్లు.

Quarrel at the wedding ceremony : వధువు డ్యాన్స్ చేయలేదట.. తన్నుకున్న పెళ్లివారు

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ వధువు తన పెళ్లిరోజు సోషియాలజీ పరీక్ష రాయాల్సి వచ్చింది. పెద్దల ప్రోత్సాహంతో పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. ఈ వీడియో ఆన్ లైన్‌లో వైరల్‌గా మారింది. నాకు పెళ్లి.. పరీక్ష రెండు ముఖ్యం.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా రావాల్సి వచ్చింది అని చెప్పింది పెళ్లికూతురు కృష్ణ రాజ్‌పుత్.

Vivek Agnihotri : ఫోటోలు తీసుకోవడానికే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఈ కాలం పెళ్లిళ్లపై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

ఇక మరో వేడుకలో బెథానీ నవజీవన్ కాలేజ్ ఆఫ్ ఫిజయోథెరపీలో చదువుకుంటున్న శ్రీలక్ష్మీ అనిల్ అనే వధువు కూడా పెళ్లికూతురి దుస్తుల్లో పరీక్ష రాయడానికి వచ్చింది. అదీ ప్రాక్టికల్ పరీక్షల కోసం. ఆమె క్లాస్ రూంలోకి రాగానే తోటి విద్యార్ధులు నవ్వులు..అరుపులతో ఆమెను ఆహ్వానించారు. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజన్లు పెళ్లికూతుర్లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ????_????? (@_grus_girls_)