Vijay Devarakonda : మరో లవ్ స్టోరీ సినిమాతో రానున్న రౌడీ హీరో..
ఏ కేర్‌లెస్ యాటిట్యూడ్‌తో, క్రేజ్‌తో ఆడియెన్స్‌ని విజయ్ ఎట్రాక్ట్ చేశాడో.. ఇప్పుడు అదే మ్యాజిక్ ఆడియెన్స్‌కి మొనాటనీ అనిపిస్తోంది..

Vijay Devarakonda
Vijay Devarakonda: ఏ కేర్‌లెస్ యాటిట్యూడ్‌తో, క్రేజ్‌తో ఆడియెన్స్‌ని విజయ్ ఎట్రాక్ట్ చేశాడో.. ఇప్పుడు అదే మ్యాజిక్ ఆడియెన్స్‌కి మొనాటనీ అనిపిస్తోంది. అందుకే ఆ మాస్ యాక్టింగ్‌ని పక్కన పెట్టి స్టైలిష్‌గా, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ప్రేమ పంచడానికి రెడీ అవుతున్నాడు ఈ రౌడీ హీరో.
ప్రజెంట్ టాలీవుడ్‌లో హాట్ కేక్‌లా సేల్ అయ్యే హీరో విజయ్ దేవరకొండ. అయితే ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఇలా వరుసగా ఫ్లాపులు ఫేస్ చేస్తున్న విజయ్.. అర్జెంట్ హిట్ కోసం పూరీతో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమా మీద ఇప్పటికే ఎక్స్‌పెక్టేషన్స్ ఫుల్‌గా ఉన్నాయి. ‘లైగర్’ తర్వాత రౌడీ హీరో మరోసారి లవర్ బాయ్‌గా మారబోతున్నాడు.
విజయ్ ఎక్స్‌పెరిమెంట్స్ చెయ్యడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే సేఫ్‌గా లవ్ ట్రాక్‌లో వెళ్దామని ఫిక్స్ అయ్యారని టాక్. ‘లైగర్’ తర్వాత శివ నిర్వాణతో కమిట్ అయిన సినిమాలో బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ఉందని, సినిమాకి హైలెట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు టీమ్. శివ నిర్వాణ ఇప్పటికే తీసిన సినిమాల్లో లవ్‌ని ఎలివేట్ చేస్తూ.. చేసిన సినిమాలే.. అందుకే రౌడీ హీరోలో కూడా సెన్సిబుల్ లవ్ యాంగిల్ చూపించబోతున్నారు శివ అండ్ కో.
కెరీర్‌లో ఇప్పటి వరకూ కొత్త డైరెక్టర్లతో, కొత్త స్టోరీలతో చేసిన ప్రయోగాలు చాలంటూ లవ్ ట్రాక్‌నే సెలెక్ట్ చేసుకుంటున్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణతో సినిమా కాకుండా మరో సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి చెప్పిన లవ్ స్టోరీకి కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. లవ్ స్టోరీలు చేసి చేసి బోర్ కొడుతోందని.. ఇదే నా చివరి లవ్ స్టోరీ అని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా టైమ్‌లో చెప్పిన విజయ్ దేవరకొండ.. మళ్లీ ఆడియెన్స్ కోసం లవర్ బాయ్‌గానే ఎంటర్‌టైన్ చెయ్యబోతున్నారు.