వైజాగ్ గ్యాస్ లీక్ ఎఫెక్ట్: పిల్లల శరీరంపై మంటలు, దుద్దుర్లు…కళ్లుకూడా తెరవలేకపోతున్నారు

ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు చికిత్స కొనసాగుతోంది. KGH లో 225 మంది బాధితులకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అలాగే వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో వందలాది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కేజీహెచ్‌లో 50 మంది చిన్నారులకు చికిత్స కొనసాగుతోంది. స్టైరిన్ గ్యాస్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కళ్ళ మంటలు, చర్మంపై దద్దుర్లతో చిన్నారులు నరకం అనుభవిస్తున్నారు.
మరోవైపు ఎల్జి పాలిమర్స్ కంపెనీ పరిసర గ్రామాల ప్రజలకు 26 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా… జీవీఎంసీ ఆధ్వర్యంలో 17 పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీరికి సింహాచలం దేవస్థానం, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.
KGH Hospital లో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. శరీరంపై మంటలు, దుద్దుర్లతో బాధ పడ్డారు. గ్యాస్ లీకేజ్ అయిన సమయంలో కళ్లలో మంటతో చిన్నారులు తీవ్రంగా బాధ పడ్డారు. వారిని సముదాయించలేక తల్లిదండ్రులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.వీరి బాధను చూడలేక తల్లులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. కొంతమంది పిల్లలకు వాంతులు కూడా అవుతున్నాయి. కొన్ని రోజుల వరకు ప్రభావం చూపిస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు
Read More :
* LG POLYMERS INDIA గ్యాస్ లీక్ : విశాఖలో వెంటాడుతున్న భయం
* ఎల్జీ పాలీమర్స్‌కు నోటీసులు.. వెంటనే రూ.50కోట్లు కట్టండి